Begin typing your search above and press return to search.
విశాఖ ‘ఉక్కు’ విషయం అందరికీ ముందే తెలుసా?
By: Tupaki Desk | 11 Feb 2021 4:16 AM GMTవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కానుందన్న విషయం అందరికీ ముందే తెలుసా ? తాజాగా బయటపడుతున్న సమాచారం ప్రకారమైతే రాష్ట్రప్రభుత్వానికి, రాజకీయనేతలతో పాటు చివరకు ఉక్కు కర్మాగారం కార్మిక నేతలకు కూడా తెలుసట. కానీ ఏమి ఎరుగనట్లు, ఇప్పుడు విషయం బయటపడినట్లు ఎవరిస్ధాయిలో వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఫ్యాక్టీరీని ప్రైవేటుపరం చేయాలనే విషయం కేంద్రప్రభుత్వం బయటపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి.
ఇదే విషయమై కేంద్రమంత్రి ధర్మేద్రప్రధాన్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీని ప్రకారమైతే విశాఖను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం జరిగింది 2018, అక్టోబర్లో. అప్పుడు తీసుకున్న నిర్ణయంపై విశాఖ ఉక్కు యాజమాన్యం-దక్షిణ కొరియా సంస్ధ పోస్కో మధ్య ఒప్పందాలు జరిగింది 2019, అక్టోబర్లో. అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగిపోతోందన్న విషయం చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు.
ఇక ఒప్పందాలు జరిగిన తర్వాత పోస్కో యాజమాన్యం రెండుసార్లు జగన్ను కలిసి సమావేశం జరిపింది. ఇదే సమయంలో కేంద్రమంత్రి ధర్మేద్రప్రధాన్ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చి ఉన్నతాధికారులతోను, కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనను తెలియజేశారు. అయితే కార్మికసంఘాల నేతల్లో కొందరు తీవ్ర నిరసన తెలిసారు. దాంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి కేంద్రమంత్రి వెళ్ళిపోయారు.
అంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగబోతోందన్న విషయం కార్మిక సంఘాల్లోని నేతల్లో కొందరికి అప్పుడే తెలుసు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయం చంద్రబాబు, జగన్ తో పాటు ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు+కొందరు కార్మిక నేతలకు కూడా బాగా తెలుసు. అంటే అందరికీ ముందే తెలిసీ ఎవరు ఎక్కడా బయటపడలేదు. ఇపుడు అధికారికంగా కేంద్రం బయటపెట్టగానే ప్రైవేటాకరణ విషయం ఇపుడే తెలిసినట్లు ఎవరిస్ధాయిలో వాళ్ళు డ్రామాలాడుతున్నారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడుకునే విషయంలో మనకు, తమిళనాడుకు పోలిక తెస్తున్నారు.