Begin typing your search above and press return to search.

దేవినేని ఆ విషయంలో ఫెవికాల్ పూసుకున్నాడా?

By:  Tupaki Desk   |   17 Aug 2020 6:00 PM IST
దేవినేని ఆ విషయంలో ఫెవికాల్ పూసుకున్నాడా?
X
దేవినేని ఉమా మహేశ్వరరావు.. ఈ మాజీ మంత్రి టీడీపీకి అరవీర భయంకరమైన విశ్వాసపాత్రుడు.. చంద్రబాబు నమ్మినబంటు అన్న పేరును సార్థకం చేసుకున్నాడని ఆ పార్టీలోనే కొందరు అంటుంటారు. ప్రతిపక్షాలపై ఒంటికాలిపై లేచే ఈయన ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. టీడీపీ మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు కేసుల్లో ఇరుక్కోవడం.. అరెస్ట్ అయ్యాక దేవినేని స్పీడు తగ్గించేశాడని అంటున్నారు.

రాష్ట్రంలో ఏమీ జరిగినా అంతా అయిపోయింది అని ప్రెస్ మీట్ పెట్టే దేవినేని ఉమా.. తాజాగా ఎందుకు విజయవాడలో పదిమంది చనిపోవడానికి కారణమైన రమేశ్ హాస్పిటల్ వ్యవహారం మీద ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని అక్కడి పరిసరాల్లో ఇప్పుడు ఇదే విషయంలో అందరూ చర్చించుకుంటున్నారట..

అయితే రమేశ్ ఆసుపత్రికి టీడీపీకి ఏం సంబంధం అని కొందరు అంటున్నా.. తీరా వాళ్ల తీరు చూస్తే రమేశ్ ఆస్పత్రి తప్పు చేసిందని.. అందుకే దేవినేని అండ్ ఆయన బ్యాచ్ నోరు మెదపకుండా నోటికి ఫెవికాల్ పూసుకున్నట్టు వ్యవహరిస్తున్నారని బెజవాడలో టాక్ నడుస్తోంది.

బెజవాడలో చీమ చిటుక్కుమన్నా ఎంట్రీ ఇచ్చే దేవినేని ఇప్పుడు పూర్తిగా నల్లపూస అయిపోయాడని అంటున్నారు. రమేశ్ ఆస్పత్రి విషయంలో టీడీపీ నేతల వ్యూహాత్మక మౌనం ఇప్పుడు బెజవాడలో చర్చనీయాంశమవుతోంది.