Begin typing your search above and press return to search.
బీజేపీ.. ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిందా?
By: Tupaki Desk | 2 Jun 2021 8:31 AM GMTతెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈ టల రాజేందర్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయి. ఆయన ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చారు. తన భవిష్యత్ పై సమాలోచనలు చేశారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు బీజేపీ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.
ఆదివారం సాయంత్రం న్యూ ఢిల్లీకి బయలుదేరిన ఈటల రాజేందర్ సోమవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాని కలిశారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ఉండనున్నారు. అయితే ఈటల ఈరోజే బీజేపీలో చేరుతాడన్న గ్యారెంటీ మాత్రం రావడం లేదట.. అతను వెంటనే నడ్డా సమక్షంలో బిజెపిలో చేరవచ్చు లేదా టిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత అధికారికంగా చేరవచ్చని.. అప్పటిదాకా సమయం కోరుతారని అంటున్నారు. ఈటలతోపాటు మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారు.
అయితే ఈటలకు బీజేపీ బంపర్ ఆఫర్ లు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. కేంద్ర కేబినెట్ లో ఈటలకు చోటుతోపాటు ఆయన సతీమణికి హుజూరాబాద్ నుంచి బరిలో దిగడానికి అవకాశం ఇచ్చినట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భూకబ్జా ఆరోపణలు రావడంతో తనను తాను రక్షించుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారన్న విమర్శలు టీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతున్నాయి.
బీజేపీలో చేరడానికి ముందే ఈటల రాజేందర్ ప్రతి ఒక్కరినీ కలిశాడు. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ మరియు తెలంగాణ జన సమితి నేతలను సహా కేసీఆర్ చేతుల్లో అణచివేతకు గురై ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి మద్దతు కోరారు. కేసీఆర్ ను ఎదురించడమే ధ్యేయమని ఈటల నాడు ప్రకటించారు. కేసీఆర్ వ్యతిరేకులైన ప్రతి వ్యక్తి నుండి తాను మద్దతు కోరుతున్నానని, స్వతంత్రంగా హుజురాబాద్‌కు ఉప ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా ఈటల మీడియాతో అన్నారు. తాను కలిసిన వివిధ పార్టీల నాయకులకు ఇదే విషయాన్ని ఈటల చెబుతున్నారు. అయితే ఇప్పుడు సడెన్ గా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.