Begin typing your search above and press return to search.
బైడెన్ అంత చెత్త నిర్ణయం తీసుకున్నారా?
By: Tupaki Desk | 2 Dec 2020 5:30 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్.. అధికార బదిలీకి ముందే.. తన టీంను సిద్ధం చేసుకోవటం తెలిసిందే. ఇప్పటికే పలు నిర్ణయాలు.. నియమకాలు చేసిన ఆయన.. తాజాగా చేసిన ఒక నియామకంపై పెద్ద ఎత్తున మండిపాటు వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో అత్యంత చెత్త నియామకం ఇదేనని పేర్కొంటున్నారు. బైడెన్ తాజా ఎంపికపై ఎందుకంత వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న విషయంలోకి వెళితే.. యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా ఇండో అమెరికన్ నీరా టాండన్ ను ఎంపిక చేశారు.
ఆమె ఎంపికను సెనేట్ లోని కీలక సభ్యులు పలువురు వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం.. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు.. పోస్టు చేసిన ట్వీటులేనని చెబుతున్నారు. ఇప్పటివరకు బైడెన్ ప్రకటించిన వాటిల్లో అత్యంత చెత్త నిర్ణయంగా కీలక సెనేటర్ జాన్ కార్నిన్ మండిపడుతున్నారు. ఆమె నియమకాన్ని రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఆమె నోటికి దురుసుతనం ఎక్కువని.. ఏ మాట పడితే ఆ మాట అంటారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. రిపబ్లికన్ల నేత మెక్ కనెల్ ను ఆమె మాస్కో మిచ్ అంటూ సంబోధించారు. తాజా నియామకం వేళ.. ఆమె ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తే.. ఆమె తన పాత ట్వీట్లను చాలా వరకు డిలీట్ చేసినట్లుగా గుర్తించారు. దాదాపు వెయ్యి ట్వీట్లను తొలగించినట్లుగా భావిస్తున్నారు. నీరాపై విమర్శలు చేస్తున్న వారిపై డెమొక్రాట్ల నేతలు పలువురు బదులిస్తూ.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే.. ఆమె వ్యాఖ్యలు చాలా బెటర్ అంటున్నారు. ఇప్పటివరకు బైడెన్ నియామకాలు అందరి ఆమోదం పొందితే.. తాజా నియామకం మాత్రం అందుకు భిన్నంగా.. రిపబ్లికన్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.