Begin typing your search above and press return to search.

ఏపీకి పెట్టుబ‌డులు వ‌చ్చాయంట‌.. తెలుసా..?

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:04 AM GMT
ఏపీకి పెట్టుబ‌డులు వ‌చ్చాయంట‌.. తెలుసా..?
X
ఇది ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేసే స‌మాచారమే! ఎందుకంటే.. ఏపీకి పెట్టుబడులు వ‌చ్చాయట‌. అది కూ డా రూ.40,361 కోట్లు వ‌చ్చిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఇది ఎవ‌రో.. గొందికాడ గ‌న్నాయ్ చెప్పిన క‌బురు కాదు.. ఏకంగా.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) వెల్లడించిందని ఢిల్లీ లోని ఏపీ ప్రభుత్వ స‌ల‌హాదారుల ప్ర‌క‌టించారు. అయితే.. అదేస‌మ‌యంలో ఏపీలో ఎందుకు చెప్ప‌డం లేదు.

అందునా.. ఢిల్లీలోని జాతీయ మీడియాలోనే ఎందుకు ప్ర‌చారం చేస్తున్నార‌నేది ప్ర‌శ్న‌. స‌రే! ఈ విష యాన్ని కొంచెం సేపు ప‌క్క‌న పెడితే.. స‌దు.. డీపీఐఐటీ వెల్లడించిన పెట్టుబ‌డులు ఏంట‌నేది ఆస‌క్తిగా మా రింది. దీంతో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. స‌హా.. మేధావులు కూడా డీపీఐఐటీ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేశారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ మ‌న‌కు కేవ‌లం 5 వేల కోట్ల మేరకు పెట్టుబ‌డులు.. వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి.. వాస్త‌వం.. ఇది అయితే.. ఢిల్లీలోని వైసీపీ అనుకూల వ్య‌క్తులు.. మీడియా కూడా ఈ చిత్ర‌మైన ప్ర‌చారం చేయ‌డం ఏంట‌నేది ప్ర‌శ్న‌.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఏపీలో భారీ ఐటీ కంపెనీలు విశాఖకు వస్తున్నాయంటూ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇది గ్రాఫిక్ అని నెటిజ‌న్లు అంటున్నారు) వీటిలో మాగంటి సాఫ్ట్ వేర్.. సాగర్ సాఫ్ట్ వేర్.. కంపెనీలు ఉన్నాయి. అయితే.. వీటి నిబ‌ద్ధ‌త‌పైనా ప్ర‌శ్న‌లు ఉన్నాయి. ఊరూ పేరూలేని కంపెనీలతో ఇచ్చిన ఆ ప్రకటన చూసి.. వాటి అడ్రస్‌లు ఎక్కడున్నాయి.. వాటిలో ఎంత మంది పని చేస్తారు.. లాంటి వివరాలు.. సోషల్ మీడియాలో పెట్టి కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.

వాస్త‌వానికి.. ఏపీకి ఆ రేంజ్‌లో అంటే.. 45 వేల కోట్ల రూపాయ‌ల పె ట్టుబ‌డులు వ‌స్తే.. ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వ మే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటుంది. సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇస్తున్నవారు.. ప్ర‌చారం చేసుకుంటు న్న‌ట్టే.. పెట్టుబ‌డుల రాక‌పైనా.. ప్ర‌చారం చేసుకునేది. కానీ..ఏపీలో మాత్రం ఎక్క‌డా ఉలుకూ ప‌లుకూ.. లేదు. కానీ.. ఢిల్లీలోనూ.. జాతీయ స్థాయి మీడియాలోనూ.. ఈ పెట్టుబ‌డుల ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతోంది. దీనికి రీజ‌నేంటి? అంటే.. మూడేళ్ల పాల‌న‌లో వైసీపీ ప్ర‌భుత్వం ఏమీతీసుకురాలేదని ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో స‌హ‌జంగానే వైసీపీ స‌ర్కారు డిఫెన్స్‌లో ప‌డిపోయింది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఏదో ఒక మూల నుంచి ఈ ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌ని భావించిన ప్ర‌భుత్వం.. ఇలా .. జాతీయ స్థాయిలో ప్ర‌చారం చేస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే.. అక్క‌డ ప్ర‌చారం చేస్తే.. ఇక్క‌డ వ‌చ్చే లాభం ఏంటి? అనేది సాధార‌ణంగా త‌లెత్తే ప్ర‌శ్న‌. ఎందుకంటే.. త‌మ ప‌రువు జాతీయ స్థాయిలోనూ.. పోతోంద‌ని భావించిన‌.. వైసీపీ నాయ‌కులు .. ఇలా అప్ర‌మత్త‌మ‌య్యార‌నే వాద‌న ఉంది.

అయితే.. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన నెటిజ‌న్లు.. స‌ర్కారును ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా చెప్పండి! అంటూ..వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డింద‌నేవాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి లేని పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని చెప్ప‌డంతోపాటు.. కేంద్ర‌మే ఈ వివరాలు చెప్పింద‌నేలా ప్ర‌చారం చేసుకోవ‌డం ఇప్పుడు వైసీపీ స‌ర్కారును వివాదంలోకి నెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.