Begin typing your search above and press return to search.

అలీ ఈ ప‌ద‌వి తీసుకుని అంత పెద్ద త‌ప్పు చేశారా....!

By:  Tupaki Desk   |   17 Feb 2023 7:00 AM GMT
అలీ ఈ ప‌ద‌వి తీసుకుని అంత పెద్ద త‌ప్పు చేశారా....!
X
సినీ న‌టుడు.. అలీ గురించి అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం న‌టుడుగానే కాకుండా.. రాజకీయంగా కూడా గు ర్తింపు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అధికార పార్టీవైసీపీలో ఉన్న ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే..ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య ఒక గుస‌గుస వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించేవారు.. ప్ర‌స్తుతం ఇచ్చిన స‌ల‌హాదారు ప‌ద‌విని తీసుకోకుండా ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం స‌ల‌హాదారుగా ఉన్న అలీ గ్రాఫ్ ప‌డిపోయింది! ఇది వాస్త‌వం కూడా. ఆయ‌న అభి మానులు కూడా ఈ ప‌ద‌విని ఎందుకు తీసుకున్నార‌ని.. కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకంటే.. స‌ల‌హాదారుల‌పై స‌మాజంలో ఏవ‌గింపు ఉంది. వీరి వ‌ల్ల ప్ర‌జాధ‌నం వృథా త‌ప్ప‌.. త‌మ‌కు ప్ర‌యోజ‌నం లేద‌ని.. ప్ర‌జ‌లే భావిస్తున్నారు. అందుకే.. వీరి విష‌యంలో సానుకూల‌త ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఇలాంటి స‌మ‌యంలోనే అలీ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా ప‌గ్గాలు చేప‌ట్టారు. అయితే..ఈయ‌న‌కు కార్యాల‌యం కానీ.. సిబ్బందిని కానీ.. విధుల‌ను కానీ కేటాయించ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఆయన ప‌ద‌విని చేప‌ట్టినా.. ప‌నిలేక ఇంట్లోనే ఉంటున్నారు. ఇది ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. కానీ, అలీ వెర్ష‌న్ మాత్రం.. జ‌గ‌న్ కు తాను వీర‌విధేయుడిన‌ని.. ఆయ‌న ఏం చెప్పినా చేస్తాన‌ని.. కాబ‌ట్టే తాను ఇలా ప‌ద‌విని తీసుకు న్నాన‌ని అటున్నారు .

అయితే.. ప‌ద‌విని తీసుకుని ఏంచేశారు? దీనివ‌ల్ల మీ ప్ర‌తిభ ఏమైనా వెలుగులోకి వ‌చ్చిందా? అనేది నెటిజ న్ల ప్ర‌శ్న‌. పైగా పార్టీలోనూ అలీకి సానుకూలత లేదు. న‌టుడిగా ఆయ‌న‌ను అభిమానించినా.. రాజ‌కీయంగా ఆయ‌న‌పై పెద్ద సానుకూలత క‌నిపించ‌డం లేదు. ఆయ‌న‌ను ఎలానూ స‌ల‌హాదారుగా ప్ర‌క‌టించారు కాబ‌ట్టి.. టికెట్ ఇవ్వ‌రేమో.. అనే సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వేళ ఎక్క‌డ ఇచ్చినా..ఆ య‌న‌కు క‌నీసం ఏడాది ముందే ఇవ్వాల్సి ఉంటుంది. లేక‌పోతే.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను రిసీవ్ చేసుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.