Begin typing your search above and press return to search.
డైమండ్ రింగ్ ను టాయిలెట్ సీట్ లో పారేసింది!
By: Tupaki Desk | 3 July 2023 1:26 PM GMTటాయిలెట్ బేసిన్ పైపులైన్లలో అరకోటి విలువైన డైమండ్ రింగ్ దొరికింది. అలా అని అదేమీ టాయిలెట్ కి వెళ్లినప్పుడు పొరపాటున అందులో పడిపోలేదు. కావాలని అందులో పాడేశారు. అదేంటీ.. ఎంత రిచ్ వ్యక్తి అయినా అరకోటి విలువ చేసే డైమండ్ రింగును టాయిలెట్ బేసిన్ లో పడేయరు కదా అనే సందేహం రాకమానదు. ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిందే.
అవును... తాజాగా జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాయిలెట్ బేసిన్ లో డైమండ్ రింగ్ కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 27న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కు చెందిన నరేంద్రకుమార్ అగర్వాల్ కోడలు జూబ్లీహిల్స్ లోని ఎఫ్.ఎం.ఎస్ డెంటల్ అండ్ స్కిన్ మెడికల్ సెంటర్ కు వెళ్లారంట.
ట్రీట్ మెంట్ జరుగుతున్న సమయంలో.. ఆమె తన చేతికున్న 50 లక్షలకు పైగా విలువైన డైమండ్ రింగును తీసి పక్కన పెట్టారంట.
అనంతరం ట్రీట్ మెంట్ అయిపోగానే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారంట. అయితే ఇంటికివెళ్లాక తన డైమండ్ రింగును మెడికల్ సెంటర్ లోనే మర్చిపోయానన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని మళ్లీ హుటాహుటిన అక్కడికి వెళ్లారట.
తీరా.. మెడికల్ సెంటర్‌కు వెళ్లి చూడటంతో.. ఆమె పెట్టిన చోటులో ఉంగరం కనిపించలేదట. దీంతో.. అందులో ఉండే సిబ్బందిని ఆరా తీశారంట. అయినా కూడా వారినుంచి సమాధానం రాకపోవడంతో నరేంద్రకుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారట. దీంతో రంగంలోకి దిగిన పోలీసులుల్ సీసీ కెమెరాలను పరిశీలించినా ఫలితం లేకపోయిందట.
దీంతో అక్కడున్న సిబ్బందిని తమదైన పద్ధతిలో విచారించారో ఏమో కానీ... అక్కడే పనిచేస్తున్న లాలస అనే యువతి.. తన పర్సులో ఎవరో టిష్యూ పేపర్ లో చుట్టి ఉంగరం పెట్టారని చెప్పిందట. అయితే అంతవిలువైన ఉంగరం తన దగ్గరుందని తెలిస్తే.. ఏం చేస్తారోనని భయపడి.. ఆ ఉంగరాన్ని బాత్ రూం కమోడ్ లో వేశానని చెప్పిందట.
దీంతో విషయం గ్రహించిన పోలీసులు... వెంటనే సిబ్బంది సాయంతో కమోడ్, పైపులైన్లు అన్ని తొలగించి మొత్తానికి ఉంగరాన్ని సాధించారట. అనంతరం ఉంగరాన్ని టాయిలెట్ బేసిన్ లో వేసిన యువతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని సమాచారం.