Begin typing your search above and press return to search.

తెలుగు నేల మీద వజ్రం దొరికింది.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   8 Aug 2019 1:30 AM GMT
తెలుగు నేల మీద వజ్రం దొరికింది.. ఎక్కడంటే?
X
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాల్లో ఒకటిగా చెప్పే కోహనూర్ వజ్రం తెలుగు నేలలోనే దొరికింది. బ్రిటీషు రాణి వారి కిరీటంలో ఉన్నప్పటికీ దాని జన్మస్థలం మాత్రం తెలుగు భూమి మీదనే. విలువైన వజ్రాలు ఎన్నో తెలుగు నేల మీద దొరికేవి. ఇప్పటికి కర్నూలు జిల్లాలో వజ్రాలు లభిస్తుంటాయి. వర్షాకాలం మొదలైందంటే చాటు.. ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దర్శనమిస్తుంటాయి.

ఈ కారణంతోనే విలువైన వజ్రాల కోసం వేలాది మంది విపరీతంగా వెతుకుతూ ఉంటారు. అయితే.. చిన్న చిన్న వజ్రాలే కానీ.. ఖరీదైన వజ్రాలు అరుదుగా దొరుకుతుంటాయి. మరే ప్రాంతంలో లేని విధంగా ఒక పక్క వజ్రాల కోసం వెతుకులాడే వారు వేలాదిగా ఉంటే.. అలా వజ్రం దొరికిన వెంటనే.. ఇలా ఖరీదు కట్టి ఎగరేసుకుపోవటానికి వీలుగా వ్యాపారులు సైతం భారీగానే కర్నూలు జిల్లాలో తిరుగుతుంటారు వర్షాకాలంలో.

తాజాగా కర్నూలుజిల్లా పగిడిరాయి గ్రామానికి చెందిన ఒక మహిళకు తన పొలంలో ఆరు క్యారెట్ల బరువు ఉన్న వజ్రం లభించిందనట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన వ్యాపారులు ఆమె వద్దకు వెళ్లి రూ.4 లక్షల క్యాష్.. 30 గ్రాముల బంగారాన్ని ఆమె చేతిలో పెట్టి తమ సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ వర్షాకాలం సీజన్ లో ఇప్పటికే బొళ్లవానిపల్లెలో వ్యవసాయ కూలికి రూ.13లక్షల విలువైన వజ్రం లభించిన తర్వాత విలువైన వజ్రం ఇదేనని చెబుతున్నారు. భూమిలో వజ్రాలు దొరికే కర్నూలు జిల్లాలో రానున్న రోజుల్లో మరెన్ని వజ్రాలు దొరుకుతాయో?