Begin typing your search above and press return to search.

కార్లు ఇచ్చాడు.. జీతం మింగేస్తున్నాడు

By:  Tupaki Desk   |   18 Dec 2016 10:14 AM GMT
కార్లు ఇచ్చాడు.. జీతం మింగేస్తున్నాడు
X
దీపావళి బోనస్ గా ఉద్యోగులకు కార్లు బహూకరించిన వ్యక్తి వారి జీతాల నుంచి కట్ చేసి పీఎఫ్ డబ్బులు మాత్రం కట్టడం లేదట. దీంతో ఇంతవరకు అంతా శభాష్ అన్న ఆ వ్యాపారవేత్త ఇప్పుడు చీ అనిపించుకుంటున్నారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్ జీ ధోలాకియా ఒక్క దెబ్బతో తన పేరంతా పాడుచేసుకున్నారు.

రూ.6,000 కోట్ల టర్నోవర్ తో కూడిన హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ చైర్మన్ ఆయన. ఓ సంస్థ అధిపతిగా ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకుంటూ ఆయన పలు మార్లు వార్తల్లోకి ఎక్కారు. దీపావళి బోనస్ కింద 2014లో ఆయన తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 491 కార్లు - 207 ఫ్లాట్స్ - ఆభరణాలను కానుకగా ఇచ్చాడు. మరి ఉద్యోగుల విషయంలో ఇంత చేస్తున్న ఆయన వారి సంక్షేమంలో భాగమైన పీఎఫ్ చెల్లించడం లేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ సంస్థకు ఆయన చెల్లించాల్సిన రూ.16.66 కోట్ల రూపాయలన ఆయన బాకీ పడ్డారు. ఆయన కంపెనీలో 3,165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, 17 మంది ఉద్యోగులనే ఈపీఎఫ్ పరిధిలో చూపిస్తూ మిగిలిన వారికి అసలు ఈపీఎఫ్ ప్రయోజనాలు కల్పించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో సూరత్ లోని ఈపీఎఫ్ వో కార్యాలయం రెండేళ్ల దర్యాప్తు అనంతరం ఫైనల్ డిమాండ్ నోటీసును తాజాగా జారీ చేసింది. రూ.16.66 కోట్లను 12 శాతం వార్షిక వడ్డీతోపాటు వార్షిక నష్టాల కింద మరో 25 శాతం చొప్పున 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/