Begin typing your search above and press return to search.

పునీత్ మరణాన్ని క్యాష్ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   6 Nov 2021 10:31 AM GMT
పునీత్ మరణాన్ని క్యాష్ చేసుకుంటున్నారు
X
కన్నడ పవర్ స్టార్, కన్నడ కంఠీరవ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు, సెలబ్రెటీలు జీర్ణించుకోవడం లేదు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేశ్, నాగార్జున, రాంచరణ్ వంటి టాలీవుడ్ సెలబ్రెటీలు పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇప్పటివరకూ చాలా మందికి తెలియదు. ఆయన గురించి తెలుసుకున్న ప్రజలంతా ఎమోషనల్ అవుతున్నారు.

దీపావళి పండుగ పూట పునీత్ ను తలుచుకొని అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని దేవుడికి జాలి లేదంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది పునీత్ రాజ్ కుమార్ దీపావళికి కన్నడ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో పునీత్ దీపావళికి కాకర్స్ కాల్చడం కాదు.. కేలరీలు బర్న్ చేద్దాం అంటూ ఫిట్ నెస్, ఎక్సర్ సైజులపై హితబోధ చేశాడు.ఇప్పుడు అదే ఫిట్ నెస్ చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారని అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు.

పునీత్ మరణంతో ఇప్పుడు అందరూ ఆయన చావుకు కారణమైన విధానాలపై అడిగి తెలుసుకుంటున్నారు. పునీత్ మరణాన్ని కొన్ని డయాగ్నోస్టిక్స్ క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? పునీత్ ఎందుకు చనిపోయాడు? ఎలా వ్యవహరించాలని పునీత్ ఫొటోతో కొన్ని డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ప్రజలను ఆస్పత్రులకు రప్పించేలా ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది.

పునీత్ మరణంపై సంతాపం తెలియజేస్తూనే ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఫ్రీగా అందరికీ గుండె, ఇతర వరకూ బానే ఉన్నా.. దానికింద గమనిస్తే మా వద్దకు మీరు బీపీ, ఈసీజీ, కొలస్ట్రాల్ చెకప్స్ చేయించుకుంటే కేవలం రూ.300 చెల్లిస్తే చాలని యాడ్ చేసింది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయాగ్నోస్టిక్స్ రాబంధులను మించిపోయాయని.. పునీత్ మరణాన్ని క్యాష్ చేసుకుంటున్నాయని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.