Begin typing your search above and press return to search.

షుగర్ కేసుల్లో అత్యధికం ఈ కారణాల వల్లేనట.. రిపోర్టు చెప్పిన నిజం

By:  Tupaki Desk   |   19 April 2023 9:59 AM GMT
షుగర్ కేసుల్లో అత్యధికం ఈ కారణాల వల్లేనట.. రిపోర్టు చెప్పిన నిజం
X
గతంలో షుగర్ ఉందా? అంటే చాలామంది నోటి నుంచి నో అనే మాట వచ్చేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా.. ఎస్ అన్న మాట వస్తోంది. అంతకంతకూ షుగర్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకు? దానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. రోజువారీ జీవితంలోనూ.. తినే తిండిలోనూ వచ్చిన మార్పే అన్న మాట వస్తోంది. ఈ మాటలో నిజాన్ని తాజాగా జరిపిన అధ్యయనం ఒకటి వెల్లడించింది.

అమెరికాకు చెందిన టఫ్ట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా ఒక అధ్యయనాన్ని చేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని నేచర్ మెడిసిన్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. 1990 నుంచి 201 మధ్యలో తమ వద్ద ఉన్న డేటా సాయంతో 30 దేశాల్లో టైప్ 2 షుగర్ రోగులపై రీసెర్చ్ చేశారు.

ఆహార అలవాట్ల కారణంగానే టైప్ 2 షుగర్ కేసులు ఎక్కువగా వస్తున్న విషయాన్ని గుర్తించారు. పరిశోధకులు చేసిన రీసెర్చ్ లో దాదాపు 1.4 కోట్ల కేసులు కేవలం ఆహార అలవాట్ల కారణంగానే టైప్ 2 షుగర్ బారిన పడినట్లుగా తేల్చారు.

సరైన డైట్ లేని కారణంగా చాలా దేశాల్లో టైప్ 2 మధుమేహం కేసులు ఎక్కువగా ఉంటే.. భారత్.. నైజీరియా.. ఇథియోపియాలో మాత్రం ప్రాసెస్ చేసిన మాంసం.. బియ్యం.. గోధుమలు.. ప్రాసెస్ చేసిన పళ్ల రసాలు.. అధిక కొవ్వు కలిగిన అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్లనేనని తేల్చారు.

అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు ఈ వ్యాధి విషయంలో కీలకంగా మారినట్లుగా గుర్తించారు.

లాటిన్ అమెరికా.. కరీబియన్ దేశాల్లో అధికంగా నమోదవుతున్న షుగర్ కేసులకు కారణం ఇక్కడి వారు కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా సేవించటం.. నాన్ వెజ్ ను అధికంగా తినటమేనని పేర్కొన్నారు. సో.. తినే తిండి విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే.. షుగర్ లాంటి వాటి బారిన పడకుండా ఉండే వీలుంది.