Begin typing your search above and press return to search.

వంశీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు: వైసీపీ నేత

By:  Tupaki Desk   |   25 Aug 2020 9:54 AM GMT
వంశీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు: వైసీపీ నేత
X
కృష్ణ జిల్లా గన్నవరం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లుగా గన్నవరంలో పార్టీ జెండా మోశామని.. నిన్నగాక మొన్న వచ్చి తమపై వంశీ పెత్తనం చెలాయించడం ఏంటని దుట్టా ప్రశ్నించారు. తమకు స్థానిక ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో పదవులు ఇవ్వడం లేదని దీన్ని దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

తమ అల్లుడు ఎమ్మెల్యే వంశీ అక్రమాలు అడ్డుకుంటే బెదిరించారని.. అవసరం అయితే తానే బరిలో నిలుస్తానని దుట్టా స్పష్టం చేశారు. కావాలంటే గన్నవరం నుంచే తానే పోటీచేస్తానని.. వైసీపీ కార్యకర్తలకు 15రోజుల్లో శుభవార్త చెబుతాను అని అన్నారు. పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు, తనకు విభేదాలు లేవన్నారు. సీఎం జగన్ కాళ్లు పట్టుకొని వంశీ వైసీపీలో చేరారని.. జగన్ కు వంశీని పరిచయం చేసిందే తాను అని దుట్టా విమర్శించారు. వంశీ తాటాకు చప్పుళ్లకు తాము బెదరము అని కుండబద్దలు కొట్టారు.

వంశీతో వ్యవహారాన్ని తాను సీఎం జగన్ వద్ద తేల్చుకున్నాకే మాట్లాడుతానన్నారు. దుట్టా తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీ ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.