Begin typing your search above and press return to search.
జగన్ శ్రీవారి దర్శనం పూర్తి అయ్యింది
By: Tupaki Desk | 4 Nov 2017 5:06 AM GMTసుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు ఏపీ విపక్ష నేత. పాదయాత్రకు అనుకున్న తేదీ దగ్గర పడుతున్న వేళ.. తాను అనుకున్నట్లే అన్ని కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా చేస్తున్నారు. దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల పాటు సాగే పాదయాత్రకు ముందు.. లండన్‌కు వెళ్లి తన కుమార్తెతో కలిసిన వైఎస్ జగన్.. ఈ రోజు (శనివారం) ఉదయం ముందుగా అనుకున్నట్లే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
ప్రజాసంకల్ప యాత్ర పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రకు ముందు శ్రీవారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం బ్రేక్ వేళ తిరుమల శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేశారు జగన్. ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు వెంట ఉన్నారు. ఎంపీ.. ఎమ్మెల్యేలతో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్న జగన్ కు వేద పండితులు ఆశీర్వదించారు.
తాను చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ నెల 6న (సోమవారం) కడపజిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలుకానుంది. ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్న పాదయాత్ర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.