Begin typing your search above and press return to search.

క‌రోనా అటాక్ః ధోనీ త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి ఇలా..

By:  Tupaki Desk   |   29 April 2021 7:01 AM GMT
క‌రోనా అటాక్ః ధోనీ త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి ఇలా..
X
దేశంలో క‌రోనా విజృంభ‌ణ భీక‌రంగా కొన‌సాగుతూనే ఉంది. జ‌నాల‌ నిర్ల‌క్ష్యం.. ప్ర‌భుత్వాల అల‌స‌త్వం కార‌ణంగా.. ఈ మ‌హ‌మ్మారి దేశం మొత్తం విస్త‌రించింది. దాదాపు 130 కోట్ల మంది ఉన్న భార‌త్ లో ప్ర‌తీ ఐదుగురిలో ఒక‌రు కొవిడ్ పాజిటివ్ గా ఉన్నార‌ట‌.

అయితే.. బాధితుల్లో రాజు-పేద తేడాలేవీ లేవు. అంద‌రినీ వ‌రుస‌బెట్టేస్తోంది కరోనా. ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖులు కొవిడ్ బారిన ప‌డ్డారు. ప‌లువురు ప్రాణాలు కోల్పోగా.. కొంద‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డుతున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ త‌ల్లిదండ్రుల‌ను కూడా క‌రోనా చుట్టుముట్టింది. వీరిద్దరికీ కొవిడ్ పాజిటివ్ రావ‌డంతో.. ఈ నెల 20న జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరారు. అప్ప‌టి నుంచి వైద్యుల పర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న దేవ‌కీ దేవి, పాన్ సింగ్‌.. ప్ర‌స్తుతం కోలుకున్న‌ట్టు స‌మాచారం.

వారిద్ద‌రి ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో బుధ‌వారం రాత్రి డిశ్చార్జ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ధోనీ పేరెంట్స్ క‌రోనాను జ‌యించ‌డంతో కుటుంబ స‌భ్యుల‌తోపాటు ఫ్యాన్స్ కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.