Begin typing your search above and press return to search.
ధనాధన్ ధోనీ వచ్చేస్తున్నాడు.. ఇదిగో ప్రూఫ్..!
By: Tupaki Desk | 26 Jan 2023 5:32 PM GMTభారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ పేరు ముందు వరుసలో ఉంటుంది. టీం ఇండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను ధోని అందించాడు. టీ20 వరల్డ్ కప్.. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ నెంబర్ వన్ ర్యాంక్ తదితర కీలక ఘట్టాలన్నీ ధోని కెప్టెన్సీలోనే జరిగాయి.
కీపర్ గా.. బ్యాట్మెమెన్ గా.. కెప్టెన్.. ఫినిషర్ గా ధోని గుర్తింపు ఉంది. మిస్టర్ కూల్.. ధనాధన్ ధోని.. ఝార్జండ్ డైనమైట్ వంటి పేర్లతో అభిమానులు ధోనిని ముద్దుగా పిలుచుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. మైదానంలో ఎంతగా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటాడో ఫినిషర్ గా అంతే అగ్రెసివ్ గా ఆడటం ధోని స్పెషాలిటీ. క్రికెట్లో హెలికాప్టర్ షాట్ సైతం ధోని వల్లే వచ్చింది.
2019లో మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన ఏళ్లు గడుస్తున్నా అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఐపీఎల్ లో ధోని సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని సైతం ధోని కెప్టెన్ గా అందించాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత జరిగిన ధోని మునుపటిలా ఆడటం లేదు. అతడి నిర్ణయాలు సైతం చెన్నై జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదు.
గతేడాది జరిగిన ఐపీఎల్ లో ధోని పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ధోని 2023 సీజన్ లో జరిగే ఐపీఎల్ లో ఆడుతాడో లేదో అన్న సందేహాలు అభిమానుల్లో కలిగాయి. అందుకు తగ్గట్టుగానే ధోని సైతం బ్యాట్ తో ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఇటీవలి కాలంలో కన్పించలేదు. దీంతో అతడు ఐపీఎల్ 2023లో ఆడక పోవచ్చనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ధోని ఫ్యాన్స్ ను ఖుషీ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
చాలారోజుల మహేంద్ర సింగ్ ధోని రాంచీలోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ధోని ఆడటం ఖాయమని అభిమానులు తెగ సంబర పడుతున్నారు. మరోవైపు చెన్నై జట్టు ఆటగాడు రవీంద్ర జడేజా సైతం శస్త్రచికిత్స అనంతరం ఐపీఎల్ 2023కి సిద్ధమవుతున్నాడు.
చెన్నై జట్టులో ఇప్పటికే ధోని.. రవీంద్ర జడేజా.. దీపక్ చాహర్.. అంబటి రాయుడు. రుతురాజ్ వంటి అద్భుత ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను చెన్నై 12.5 కోట్లకు దక్కించుకుంది. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని నెగ్గాలని చెన్నై జట్టుగా కసిగా ఉందనే టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.