Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఆసూయ పుట్టించేలా ధోనీ ఐడియాలు
By: Tupaki Desk | 5 Jan 2021 5:30 AM GMTఅసలు టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారధి ఎంఎస్ ధోనీ ఏంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏంది? అసలు ఈ ఇద్దరికి ఎక్కడైనా పోలిక ఉందా? లింకు ఉందా? మీరు.. మీ రాతలూ అన్న చిరాకు వచ్చేస్తే మీరు తప్పులో కాలేసినట్లే. కాస్త కూల్ గా చదివితే చాలానే విషయాలు తెలుస్తాయి.అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత నుంచి మహేంద్రసింగ్ ధోనీ కొత్త వ్యాపారాల వైపు ఫోకస్ పెట్టారు. తొలుత రాంచీలో రెండువేల కడక్ నాథ్ కోళ్లతో ఫౌల్ట్రీ ఫాం పెట్టిన ఆయన.. తాజాగా తన ఫాంహౌస్ లో కూరగాయల్ని పండిస్తున్నారు.
ఏదో పండిస్తున్నామంటే పండిస్తున్నట్లు కాకుండా.. తన ఫాంహౌస్ లో పండించే కూరగాయలు.. పండ్లకు భారీ మార్కెట్ ను సిద్ధం చేశారు. ఆయన పండించే స్ట్రాబెర్రీ.. క్యాబేజీ.. టమోటతో సహా ఇతర కూరగయాల్ని ఆయన దుబాయ్ కు ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే చూద్దాం. వారంలో వీలైనన్ని ఎక్కువ రోజు ఫాంహౌస్ లో.. తక్కువగా ప్రగతిభవన్ లో ఉండే ఆయన.. అక్కడకు వెళ్లినప్పటి నుంచి వ్యవసాయం మీదనే ఫోకస్ అని చెబుతారు.
దాదాపు వంద ఎకరాలకు పైనే ఉన్న ఫాంహౌస్ లో బోలెడన్ని పంటల్ని పండిస్తారని చెబుతారు. ప్రతిదానికి ఆ రంగంలో విశేషంగా అనుభవం ఉన్న వారితో పాటు.. మాంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని పిలిపించుకొని మరీ పంటలు వేస్తుంటారు. అలా పండిన పంటల్ని ఆయన బయటకు పంపుతున్నా.. ధోనీ మాదిరి విదేశాలకు పంపుతున్నది లేదు. అంతేనా.. ధోనీ తన ఫాంహౌస్ లో పండించే పంటలకు ఫాం ఫ్రెష్ అనే ఏజెన్సీని ఎంపిక చేసుకొని.. బ్రాండింగ్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన బాధ్యతల్ని జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకున్నట్లు చెబుతున్నారు. మరీ.. లెక్కన ధోనీ చేసుకుంటున్న మార్కెటింగ్ తో పోలిస్తే.. సీఎం కేసీఆర్ ఎంతలా వెనుకబడిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు చెప్పండి.. ధోనీలోని రైతు యాంగిల్.. అతగాడు చేస్తున్న పనులు చూస్తే.. కేసీఆర్ ఆసూయ పడకుండా ఉంటారా చెప్పండి?