Begin typing your search above and press return to search.
అప్పులు ఎక్కువ అయ్యాయి.. సారీ అంటూ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్
By: Tupaki Desk | 1 May 2023 10:36 AM GMTబుల్లితెర రియాలిటీ డ్యాన్స్ షోలలో కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూ.. పలువురికి సుపరిచితులైన ముప్ఫై రెండేళ్ల కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. తనను అందరూ క్షమించాలని..సారీ చెబుతూ తప్పనిసరి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటున్నట్లుగా వీడియోను పోస్టు చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అప్పటికే ఆత్మహత్య చేసుకున్న చైతన్యను గుర్తించారు.
''అమ్మా.. నాన్న.. చెల్లి నన్ను క్షమించండి.. కొరియోగ్రాఫర్లు మిమ్మల్నిహర్ట్ చేస్తున్నాను.. అప్పులు ఎక్కువ అయ్యాయి.. వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నాను. అందుకు ఆత్మహత్య నిర్ణయాన్ని తీసుకున్నాను'' అంటూ నెల్లూరు క్లబ్ హోటల్ లో రూం అద్దెకు తీసుకున్న చావా చైతన్య సూసూడ్ చేసుకున్నారు. లింగ సముద్రం మండలానికి చెందిన ముత్తావారి పాలేనికి చెందిన సుబ్బారావు దంపతుల కుమారుడే చైతన్య.
కొరియోగ్రాఫర్ గా హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటాడు. పలు టీవీ చానళ్లలో టెలికాస్ట్ అయ్యే రియాల్టీ షోలలో.. డ్యాన్స్ షోలలో కొరియోగ్రాఫర్ గా వ్యవహరించే అతనికి నెల్లూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో సన్మానం చేసేందుకు ఆహ్వానించారు. ప్రపంచ డ్యాన్స్ డే సందర్భంగా నెల్లూరులోని కళాంజలి ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ నిర్వాహకులు ఈ నెల 29న (శుక్రవారం) సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి హాజరైన చైతన్యకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుు వీలుగా నెల్లూరు క్లబ్ గదిలో రూం తీసుకున్నాడు. ప్రోగ్రాంకు హాజరైన అనంతరం ఆదివారం సాయంత్రం తనకు అప్పులు ఎక్కువైనట్లుగా పేర్కొంటూ.. సారీ చెప్పి ఒక సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు.
దాన్ని సన్నిహితులకు పంపిన అతను.. రూంలోని ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియోను చూసినంతనే స్నేహితులు స్పందించి.. నెల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించిన వారు హోటల్ రూం వద్దకు వెళ్లేసరికి అప్పటికే చైతన్య సూసైడ్ చేసుకొని విగతజీవిగా మారాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. చేతికి అంది వచ్చిన కొడుకు చేసిన పనితో చైతన్య తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చైతన్య ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.