Begin typing your search above and press return to search.

ర‌చ్చ ర‌చ్చ‌గా మారి ధ‌ర్నా చౌక్‌!

By:  Tupaki Desk   |   15 May 2017 8:39 AM GMT
ర‌చ్చ ర‌చ్చ‌గా మారి ధ‌ర్నా చౌక్‌!
X
ధ‌ర్నా చౌక్ వేదిక‌ను మార్చాలంటూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. ధ‌ర్నా చౌక్ ప‌రిర‌క్ష‌ణ కోసం వామ‌ప‌క్షాలు చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ర‌చ్చ ర‌చ్చగా మారింది. ధ‌ర్నా చౌక్ ను త‌ర‌లించేందుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించిన వామ‌ప‌క్షాల‌కు ఈ ఉద‌యం (సోమ‌వారం) వ‌ర‌కూ అనుమ‌తి ఇచ్చే విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోని పోలీసులు.. ఉద‌యం అనుమ‌తిచ్చారు. అనూహ్యంగా.. ధ‌ర్నా చౌక్ ను త‌ర‌లించాల‌ని గ‌ళం విప్పిన స్థానికులు నిర‌స‌న కు సైతం అనుమ‌తి ఇవ్వ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ఒకే స‌మ‌యంలో.. ఒకే ప్ర‌దేశంలో.. ఒకే అంశానికి భిన్న‌మైన వాద‌న‌లు వినిపించే రెండు వ‌ర్గాల‌కు పోలీసులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ధ‌ర్నా చౌక్ ను కొన‌సాగించాల‌నుకునే వారు.. వెంట‌నే త‌ర‌లించాల‌ని డిమాండ్ చేసే రెండు వ‌ర్గాలు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద‌కు చేరుకోవ‌టం.. ఇరు వ‌ర్గాలు త‌మ వాద‌న‌ల్ని బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేయ‌టంతో ఎక్క‌డేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి.

ఉద‌యం తొమ్మిదిన్న‌ర గంట‌ల ప్రాంతంలో ఇరు వ‌ర్గాలు ఒక చోట‌కు చేరుకొని.. పోటాపోటీ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న వేళ‌.. పోలీసులు సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉన్న విష‌యాన్ని ప‌లు ఛాన‌ళ్లు ఎత్తి చూపాయి. ఇదిలా ఉంటే.. అంత‌కంత‌కూ పెరిగిన ఉద్రిక్త‌త‌లు ఉద‌యం ప‌ది గంట‌ల ప్రాంతంలో ఒక్క‌సారిగా అదుపు త‌ప్పాయి.

ధ‌ర్నా చౌక్ ను కావాల‌నే వారు.. వ‌ద్ద‌నే వారు రెండు గ్రూపులుగా మారి ప‌ర‌స్ప‌రం నినాదాలు చేసుకోవ‌టం మొద‌లు.. ఇరు వ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు కుర్చీలు విసురుకునే ప‌రిస్థితి వ‌ర‌కూ వెళ్ల‌టంతో ఏం జ‌రుగుతుందన్న అయోమ‌యం క‌నిపించింది. ఇదే స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారం మొత్తాన్ని క‌వ‌ర్ చేస్తున్న మీడియా బృందం మీద గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాళ్లు విస‌ర‌టంతో.. కొద్దిమందికి గాయాల‌య్యాయి. ఉద్రిక్త‌త అంత‌కంత‌కూ పెరుగుతున్న‌వేళ‌.. అద‌న‌పు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున ధ‌ర్నా చౌక్ ప్రాంతానికి చేరుకున్నాయి. ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితుల్లో.. ధ‌ర్నా చౌక్ నిర‌స‌న సాగుతోంది. ఒకే స‌మ‌యంలో ఇలా రెండు వ‌ర్గాల‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.