Begin typing your search above and press return to search.

వైసీపీ తొలి టికెట్ ఆయనదే...?

By:  Tupaki Desk   |   2 May 2022 1:30 AM GMT
వైసీపీ తొలి టికెట్ ఆయనదే...?
X
ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడచిన వారు. జగన్ సైతం ఆయనకు తగిన గౌరవం ఇచ్చారు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్య్మంత్రి ధర్మాన క్రిష్ణదాస్. ఆయనను జగన్ జిల్లా ప్రెసిడెంట్ చేశారు. ఇక తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో అధ్యక్షులే సుప్రీం అని జగన్ ప్రకటించడం, రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి వారికే చైర్మన్లు చేస్తామని కూడా చెప్పడంతో వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ల ఉత్సాహానికి అవధులు లేవు.

కొందరైతే దూకుడు పెంచేస్తున్నారు. అలాంటి వారిలో క్రిష్ణ దాస్ కూడా చేరిపోయారు. ఆయన నిదానమే ప్రధానం అనుకుని సాగే నాయకుడు. కానీ ఈ మధ్య మాత్రం ఆయన పవర్ ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాంతో పాటు విపక్షాలకు తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఆయన బోల్డ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో తాను నరసన్నపేట నుంచి తిరిగి పోటీ చేస్తున్నాను అని. ఈ విషయంలో రెండవ మాట లేదని కూడా చెప్పేశారు.

ఆ విధంగా ఆయన తన టికెట్ తానే ఇచ్చేసుకున్నారు అన్న మాట. నిజానికి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నా టికెట్ హై కమాండ్ ఇవ్వాలి. అయినా ఇప్పటికి ఇంకా మూడేళ్ళు మాత్రమే అయింది. ఎన్నికలకు చాలా టైమ్ ఉంది. దాంతో ఇపుడే తొందరెందుకు దాసన్నా అని వైసీపీలోనే సెటైర్లు పడుతున్నాయి. మరో వైపు ఆయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి తన టికెట్ ని ముందుగా ప్రకటించుకుంటే మిగిలిన సీట్ల సంగతేంటి అన్న చర్చ కూడా వస్తోంది.

ఇక దాసన్న ఆదికి ముందు ఇలా ప్రకటించడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి అంటున్నారు. అవేంటి అంటే ఈ సీటు మీద తమ్ముడు ప్రస్తుత మంత్రి ప్రసాదరావు కన్నేశారు అని అంటున్నారు. ఆయన మొదట్లో ఇక్కడ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యే అవుతూ వచ్చారు. ఇక 2004 నుంచి మాత్రమే అన్నదమ్ములు ఒప్పందం ప్రకారం ప్రసాదరావు శ్రీకాకుళానికి షిఫ్ట్ అయ్యారు. ఇక అక్కడ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో ఆయన నరసన్నపేట మీద కర్చీఫ్ వేశారు అని కూడా వినిపిస్తోంది.

ఇక కిష్ణదాస్ కూడా ఒకానొక టైమ్ లో తన కుమారుడు క్రిష్ణ చైతన్యను 2024లో పోటీకి పెట్టాలని ఆలోచించారు. దాంతో కూడా టీడీపీ నుంచి కొందరు వైసీపీ నుంచి మరి కొందరు ఈ సీటు మీద కన్నేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఏమనుకున్నారో ఏమో కానీ తానే మళ్ళీ పోటీ చేస్తాను అంటూ దాసన్న స్టేట్మెంట్ ఇచ్చి క్యాడర్ కి ఉత్సాహం ఇచ్చారు. కానీ టికెట్ ఇచ్చేది వైసీపీ అధినాయకత్వం అన్న సంగతిని ఆయన మరచిపోయారు అంటున్నారు. మొత్తానికి దాసన్న ప్రకటన అఫీషియల్ గా చూస్తే 2024 ఎన్నికకలు తొలి టికెట్ ఆయనదే అన్న మాట.