Begin typing your search above and press return to search.
తగ్గేదే లే... ధూం ధాం గా దాసన్న ...?
By: Tupaki Desk | 21 April 2022 12:43 PM GMTశ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధికార వైభోగం అంతా ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే తిరుగుతోంది. అన్న క్రిష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఇలా దిగిపోగానే తమ్ముడు ధర్మాన ప్రసాదరావు అలా డ్యూటీ తీసుకున్నారు. ఇక అన్న చేపట్టిన రెవిన్యూ శాఖనే ఆయన అందుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకు వచ్చిన ప్రసాదరావుకు క్యాడర్ మొత్తం ఒక్కటై ఘన స్వాగతం పలికింది.
సీన్ కట్ చేస్తే ఇపుడు అన్న వంతు. ధర్మాన క్రిష్ణదాస్ అంటే జగన్ కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆయనను శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ని చేసారు. దాంతో దాసన్న ఈ నెల 23న పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. దాంతో మంత్రిగా తమ్ముడు చేసిన హడావుడికి ఏ మాత్రం తగ్గకుండ అన్న క్రిష్ణదాస్ కూడా ఘనమైన స్వాగత సర్కారాలకు రెడీ అవుతున్నారు.
భారీ ఎత్తున ఊరేగింపులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వైసీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక విధంగా తమ్ముడి మినిష్టర్ దర్జా ముందు ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా అన్న గారి ఆర్భాటం ఉంటుంది అంటున్నారు.
శ్రీకాకుళంలోని పార్టీ ఆఫీసులో ప్రెసిడెంట్ గా క్రిష్ణదాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో అంటే వైసీపీ విపక్షంలో ఉన్నపుడు క్రిష్ణదాస్ జిల్లా సారధిగా పనిచేశారు. ఇపుడు అధికారంలో ఉండగా మళ్లీ పగ్గాలు అందుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించి జగన్ని సీఎం చేయడమే తమ లక్ష్యమని దాసన్న గట్టిగా చెబుతున్నారు. మొత్తానికి మంత్రి పదవి నుంచి దిగిపోయినా అధికార దర్జా మాత్రం దాసన్నకే ఉండాలన్న పట్టుదల ఆయన వర్గంలో కనిపిస్తోంది. చూడాలి మరి అన్నదమ్ముల అందమైన పోటీ జిల్లా వైసీపీని ఏ విధంగా బలోపేతం చేస్తుందో.