Begin typing your search above and press return to search.
హమ్మయ్య...జగన్ కి వారసుడిని పరిచయం చేసేశారుగా..?
By: Tupaki Desk | 23 March 2022 8:00 AM ISTరాజకీయాల్లో వారసుల పర్వం నడుస్తున్న కాలమిది. తామూ తరువాత తమ వారూ ఇదే నయా రాజనీతి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. తాము వెలుగులో ఉండగానే కుమార రత్నాలకూ వైభవం తీసుకురావాలి. ఈ కాన్సెప్ట్ తోనే అంతా ముందుకు సాగుతున్నారు. దానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కూడా అతీతం కారు కదా.
అందుకే ఆయన 2024 ఎన్నికల కోసమా అన్నట్లుగా తన కుమారుడు డాక్టర్ క్రిష్ణ చైతన్యను వెంటబెట్టుకుని మరీ జగన్ని రీసెంట్ గా అసెంబ్లీ సెషన్ వేళ కలిశారు. ఇక క్రిష్ణ చైతన్య నరసన్నపేట మండలం మడపాం లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల గురించి సీఎం వద్ద ప్రస్తావించగా సానుకూలంగా స్పందించారు. ఏప్రిల్ లో పనులు మొదలుపెడదామని జగన్ ధర్మాన కృష్ణచైతన్యతో చెప్పడంతో జెడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన జూనియర్ దాసన్న అలా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు అని క్యాడర్ మురుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు క్రిష్ణ చైతన్యను నరసన్నపేట నుంచి పోటీ చేయించాలని ధర్మాన క్రిష్ణ దాస్ అయితే భారీ స్కెచ్ వేశారు. తన కుమారుడికి సీటు దక్కేలా ఆయన తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఇక క్రిష్ణ చైతన్య కూడా తండ్రికి బదులుగా నరసన్నపేట అంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
కేవలం జెడ్పీటీసీగా కాకుండా ఎమ్మెల్యేగానే ఆయన మొత్తం నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు. నరసన్న పేట మూడున్నర దశాబ్దాలుగా ధర్మాన ఫ్యామిలీకి కంచుకోట. రెండు సార్లు ధర్మాన ప్రసాదరావు అక్కడ గెలిచారు. నాలుగు సార్లు క్రిష్ణ దాస్ గెలిచారు. ఇపుడు క్రిష్ణ చైతన్య కూడా తొలిసారి ఎమ్మెల్యే గా అక్కడ నుంచే జెండా పాతాలని తండ్రిగా క్రిష్ణదాస్ కలలు కంటున్నారు. మొత్తానికి జగన్ బ్లెస్సింగ్స్ దక్కాయి కాబట్టి ఇక ఈ యువ నాయకుడు దూసుకుపోవడమే తరువాయి అని అంటున్నారు వైసీపీ నేతలు.