Begin typing your search above and press return to search.

పేట పాలిటిక్స్ : దాస‌న్న‌కు ఓట‌మి భ‌యం తెర‌పైకి కొత్త ముఖం !

By:  Tupaki Desk   |   20 Feb 2022 11:30 PM GMT
పేట పాలిటిక్స్ : దాస‌న్న‌కు ఓట‌మి భ‌యం తెర‌పైకి కొత్త ముఖం !
X
డిప్యూటీ సీఎం దాస‌న్న‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది.దీంతో ఆయ‌న ఏం చేయాల‌నుకున్నా కూడా అవేవీ ఫ‌లితం ఇచ్చేలాలేవు. సోష‌ల్ మీడియాలో కూడా కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న వ్యాఖ్య‌లు విప‌రీతంగా ట్రోల్ అవుతున్నాయి.త‌మ్ముడు ప్ర‌సాద‌రావు (శ్రీ‌కాకుళం శాస‌న‌స‌భ్యులు)కు, త‌న‌కూ ఎటువంటి విభేదాలూ లేవ‌ని అంటున్నారే కానీ అవేవీ నిజం కాదు అని ఎప్ప‌టిక‌ప్పుడు న‌మోదుకు నోచుకుంటున్నా వాస్త‌విక ప‌రిణామాలే నిద‌ర్శ‌నం అయి ఉంటున్నాయి.

దీంతో త‌న‌ని తాను కాపాడుకునేందుకు బ‌య‌ట‌కు కాస్త గంభీరంగానే ఉన్నా,పెరిగిపోతున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త, ఆ ఇంట పెరిగిపోతున్న ఇల్లాలి పెత్త‌నం ఇవ‌న్నీ కూడా మంత్రికి ఓ విధంగా ప్ర‌తిబంధ‌కాలు అవుతున్నాయి.మరోవైపు కింజ‌రాపు సోద‌రుల కుమారుల నుంచి కూడా గ‌ట్టి పోటీనే వ‌స్తోంది.

ఒక్కరు కాదు ఇద్ద‌రు కాదు మొత్తం ముగ్గురు నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ చేశారు.వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే రామూ మాతృమూర్తి విజ‌య కుమారి న‌ర‌స‌న్న‌పేట నుంచి పోటీచేస్తారు అన్న ఊహాగానాలు వ‌చ్చాయి.ఇదే స‌మ‌యంలో అచ్చెన్న జీవ‌న స‌హ‌చ‌రి విజ‌య మాధ‌వి కూడా ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లో ఉన్నా కూడా ఇంకా యాక్టివ్ కావాల‌ని భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంకు సంబంధించి టీడీపీ ప‌నులు అటు విజ‌య మాధురితో పాటు కొడుకు కృష్ణ మోహ‌న్ నాయుడు చ‌క్క‌దిద్దుతూ ఉన్నారు. ఇప్పుడు న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంపై కూడా ఇదే విధంగా ఫోక‌స్ పెట్టారు.

ఓ వైపు ఎంపీ రామూతో పాటు త‌మ్ముళ్లు (బాబాయ్ అచ్చెన్న కుమారుడు కృష్ణ మోహ‌న్ నాయుడు, మ‌రో బాబాయ్ కుమారుడు హ‌రి వ‌ర ప్ర‌సాద్ కుమారుడు సురేశ్ నాయుడు) కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప్రేమ పెంచుకుంటున్నారు.ఇదే స‌మ‌యంలో దేశ రాజ‌కీయాల‌ను వ‌దిలి ఈ సారి స్థానిక రాజ‌కీయాల్లో మంచి పేరు తెచ్చుకోవాల‌ని భావిస్తున్న ఎంపీ రామూ కూడా త‌న పంథా మార్చేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అధినేత ఒప్పుకుంటే, కుటుంబ పెద్ద‌లు అయిన అచ్చెన్న‌తో స‌హా అమ్మ విజ‌య‌మ్మ ఇంకా ఇత‌రులు అంగీకారం తెలిపితే ఆయ‌న న‌ర‌స‌న్ప‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాలు కొట్టిపారేయ‌లేం.దీంతో పేట రాజ‌కీయం క్రియాశీల‌కం కానుంది.

మ‌రోవైపు వైసీపీ త‌ర‌ఫున సార‌వ‌కోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు బ‌రిలో ఉండ‌నున్నారు అన్న టాక్ కూడా వ‌స్తోంది. అధినేత జ‌గ‌న్ ఆదేశిస్తే పోటీకి సిద్ధ‌మేన‌ని అంటున్నారీయ‌న అని తెలుస్తోంది.దాస‌న్న‌ను ఎంపీగా పోటీ చేయ‌మ‌ని జ‌గ‌న్ చెప్పే అవ‌కాశాలున్నాయ‌ని, ఆ విధంగా శ్రీ‌కాకుళం ఎంపీ స్థానాన్ని ఎలా అయినా ఈ సారి త‌మ పార్టీ ఖాతాలో వేయాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ భావిస్తున్నారు.

క‌నుక ఈ సారి ఏమ‌యినా జ‌ర‌గొచ్చు. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు అనే విధంగా రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి.మరోవైపు గ‌త సారి (2014లో) ఎమ్మెల్యేగా ఎన్నికై స‌రిగా ప్ర‌భావితం చేయ‌లేని బ‌గ్గు ర‌మ‌ణ మూర్తికి 2024 లో నో ఛాన్స్ అని అధినేత అంటున్నార‌ని కూడా తెలుస్తోంది.