Begin typing your search above and press return to search.
అవసరమా ధర్మాన మీకు.. ఆ వ్యవహారం
By: Tupaki Desk | 20 Feb 2020 8:15 AM GMTఎంత బలవంతుడైనా అనువుగాని చోట అధికులమనరాదన్న మాటను మరచిపోతే పరాభవం ఎదుర్కోవాల్సిందే. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది సూటిగా సరిపోతుంది. తాజాగా ఓ ఎమ్మెల్యే తన స్థాయికి మించి పనులు చేయడంతో అభాసుపాలయ్యాడు. కీలక నాయకుడిగా ఉన్న వ్యక్తికి చిన్న విషయంలో గడ్డు పరిస్థితి ఎదురైంది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు కీలక నాయకుడు. ఆయన మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే స్థానికంగా జరిగిన చిన్నపాటి విషయంలో ఆయన ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. దీంతో ధర్మాన ప్రసాదరావు ఖంగు తిన్నారు.
శ్రీకాకుళం లో మార్కెట్ వ్యవహారం లో ధర్మాన ప్రసాద రావు జోక్యం చేసుకున్నారు. శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో నాలుగు వర్గాలున్నాయి. వీటిలో మూడు వర్గాలు వైఎస్సార్సీపీకి మద్దతుగా మిగిలిన ఒక్క వర్గం టీడీపీకి మద్దతు ఉంది. అయితే ఇక్కడ ఫిరాయింపుల రాజకీయం చేయాలని ధర్మాన చూశారు. దీంతో మిగిలిన ఆ ఒక్క వర్గాన్నీ తమవైపు తిప్పుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా వర్తక సంఘం లో తమ ఆధిపత్యం నడవాలంటే అన్ని వర్గాలు తమవే కావాలని పార్టీ నాయకులు తెలపడంతో ధర్మాన ముందడుగు వేశారు. అభివృద్ధి జరగాలంటే వర్తక సంఘం లో ఎమ్మెల్యే కు అనుకూలమైన ప్రతినిధే ఉండాలని చెబుతూ బహిరంగ ప్రచారం చేశారు.
అయితే ఈ అంశం టీడీపీ వర్గం వర్తకులు తిప్పికొట్టారు. ఈ చర్య అధికార పార్టీ మద్దతుగా ఉన్న వర్తకులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలోని ధర్మాన వర్గం, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీగా ఓ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ వర్తక సంఘంలోని ధర్మాన అనుకూల వర్గం రక్తదాన శిబిరం నిర్వహించగా వారి వ్యతిరేక వర్గం మరో వర్తక సంఘం వేరే కార్యక్రమం నిర్వహించింది. అయితే ధర్మాన అనుకూల వర్గం నిర్వహించిన కార్యక్రమానికి స్పందన రాలేదు. కేవలం 20 మంది పాల్గొనగా, ఆయన వ్యతిరేక వ్యాపార వర్తక సంఘం చేపట్టిన కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. దీంతో ఈ విధంగా రాజకీయ ఉద్ధండుడు స్థానిక రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ విధంగా ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొంటున్నారు.
ధర్మాన ప్రసాదరావు 2004, 2009, 2019 ఎన్నికల్లో గెలిచారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి మార్కెట్ లో చిల్లర రాజకీయం చేయడంతో కొంత విమర్శలు వచ్చాయి. అవసరమా? అనే మాట వచ్చింది.