Begin typing your search above and press return to search.
ధరణి ప్రారంభం.. కేసీఆర్ దత్తత గ్రామానికే దిక్కులేదు?
By: Tupaki Desk | 29 Oct 2020 2:50 PM GMTతెలంగాణలో భూ సమస్యలు లేకుండా పారదర్శక రిజిస్ట్రేషన్ల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన ‘ధరణి పోర్టల్’ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌తో సత్వర రిజిస్ట్రేషన్లు, వెంటనే మ్యుటేషన్లు జరుగుతాయన్నారు. నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో 570 తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ పనిచేస్తుందన్నారు.
ధరణి వెబ్‌సైట్‌తో పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేను రైతునేనని, భూముల విషయంలో ఎన్ని కష్టాలుంటాయో నాకు తెలుసన్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
రెవెన్యూ చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ ఏవీ ఉపయోగపడలేదన్నారు. ఇప్పటి తెలంగాణ రెవెన్యూ కొత్త చట్టంతో అనేక మార్పులు తీసుకొస్తుందన్నారు. భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ ప్లేసులో ఉందన్నారు.
కాగా సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించిన మూడు చింతలపల్లి కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఒకటి. అయితే ఇప్పటికే మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామంలో భూములు ఆన్ లైన్ లోకి ఎక్కడం లేదట.. ఇక్కడి గ్రామస్థులు ఎన్ని రోజులు అధికారుల చుట్టూ తిరిగినా రికార్డుల్లో భూములు మాత్రం ఎక్కలేదు. దీంతో ఇక్కడ భూములు ఉన్నా లేనట్టేనని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలోనే ఇలా ఉంటే ఇక వేరే గ్రామాల్లో పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. కేసీఆర్ సభ సందర్భంగా మీడియాతో ఆ గ్రామస్థులు తమ బాధలు చెప్పుకున్నారు.
భూములు ఆన్ లైన్ కాకపోవడంతో కేసీఆర్ దత్తత గ్రామంలో రైతుబంధుకు సైతం రైతులు నోచుకోలేదన్నారు. ఇతర బీమా పథకాలు దరిచేరడం లేదని మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ వాసులు వాపోతున్నారు. మంత్రులు, అధికారులు తమ సమస్యను గాలికి వదిలేశారని వారంతా మండిపడుతున్నారు. ధరణి పోర్టర్, కొత్త రెవెన్యూ చట్టం ద్వారా నైనా సమస్యలు తీర్చాలని కేసీఆర్ గ్రామస్థులు వేడుకున్నారు.