Begin typing your search above and press return to search.

మలయాళ నటి 130 కోట్లకు ముంచేసింది

By:  Tupaki Desk   |   17 Dec 2016 11:44 AM GMT
మలయాళ నటి 130 కోట్లకు ముంచేసింది
X
రియల్ ఎస్టేట్ వాళ్లు తమ పెట్టుబడుల్ని సినిమాల్లోకి తెచ్చి పెట్టడం సహజం. అలాగే సినిమా వాళ్లు కూడా తమ సంపాదనను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడమూ మామూలే. ఐతే కొన్నిసార్లు అంచనాలు తప్పి.. ఈ వ్యాపారాలు తేడా కొట్టేస్తుంటాయి. అప్పుడు జనాలకు టోపీలు పెట్టేస్తుంటారు. మలయాళ నటి ధన్య మేరీ వర్గీస్ ఇప్పుడు ఇలాంటి కుంభకోణంలోనే చిక్కుకుని అరెస్టయింది. రూ.130 కోట్లకు మోసం చేసిన కేసులో మేరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధన్య.. ఆమె భర్త.. అతడి సోదరుడు శామ్యూల్ ను కూడా ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ల కుటుంబం శాంసన్స్ బిల్డర్స్ పేరుతో కంపెనీ పెట్టి.. అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నారు.

ఐతే జనాల దగ్గర అడ్వాన్సులు తీసుకుని అపార్ట్ మెంట్లు ఇవ్వకుండా మోసం చేయడంతో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా రూ.130 కోట్లకు వీరు జనాల్ని ముంచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ధన్య మావయ్య జాకబ్ శాంసన్ ను గత నెలలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మాజీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. మేరీతో పాటు ఆమె భర్త.. మరిది ఊరు విడిచి పారిపోగా.. వారిని తమిళనాడులోని నాగర్ కోయిల్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేరీ ఈ కంపెనీలో డైరెక్టర్ కాకున్నా.. తాను డైరెక్టర్ అని చెప్పి జనాల్ని మోసం చేసిన్టుల పోలీసులు చెబుతున్నారు. శాంసన్ బిల్డర్స్ పేరుతో 2011లో కంపెనీ పెట్టి.. రెండేళ్లలో 20 విల్లాలు.. 500 అపార్ట్ మెంట్లు కట్టి ఇస్తామన్న హామీతో పెట్టుబడులు తీసుకుని.. ఆపై డబ్బులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/