Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి తెలంగాణ డీజీపీ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ కు ఎందుకు వెళ్లిన‌ట్లు?

By:  Tupaki Desk   |   9 July 2019 6:13 AM GMT
అర్థ‌రాత్రి తెలంగాణ డీజీపీ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ కు ఎందుకు వెళ్లిన‌ట్లు?
X
ఒక రాష్ట్ర పోలీసు అత్యున్న‌త అధికారి అర్థ‌రాత్రి వేళ ఒక పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంటుందా? ఒక‌వేళ వెళితే అది క‌చ్ఛితంగా ఆస‌క్తిక‌ర అంశ‌మే. తాజాగా అలాంటి ప‌నే చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మ‌హేంద‌ర్ రెడ్డి. నిన్న (మంగ‌ళ‌వారం) అర్థ‌రాత్రి ఆయ‌న న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ కు వెళ్లారు. ఆక‌స్మిక త‌నిఖీ చేప‌ట్టారు.

వారం వ్య‌వ‌ధిలో పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో రెండు హ‌త్య‌లు చోటు చేసుకోవ‌టం.. నిందితులను ప‌ట్టుకునే విష‌యంలో పోలీసుల వైఫ‌ల్యంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. వ్యాపార‌వేత్త రాంప్ర‌సాద్ హ‌త్య‌లో నిందితుల్ని ఎందుకు ప‌ట్టుకోలేక‌పోయార‌ని ఫైర్ అయిన‌ట్లు చెబుతున్నారు.

ఇటీవ‌ల వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌త్రిక‌ల్లోకి ఎక్కుతుంద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. అధికారుల ప‌నితీరుపైనా ఆయ‌న ఫైర్ అయ్యారు. దాదాపు రెండు గంట‌ల‌పాటు పోలీస్ స్టేష‌న్ లో గ‌డిపిన‌ట్లుగా తెలుస్తోంది. అన్నింటికంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం మ‌రొక‌టి ఉంది. ఇటీవ‌ల కాలంలో పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ సిబ్బందిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అక్క‌డి సిబ్బందికి బ్రీత్ అన‌లైజ‌ర్ తో ప‌రీక్ష‌లు చేయించిన‌ట్లుగా తెలుస్తోంది.
బ్లూకోట్ సిబ్బందితోపాటు పెట్రోకారు సిబ్బంది వివ‌రాలు.. వారి రిజిస్ట‌ర్ ను తెప్పించుకొని చెక్ చేసిన‌ట్లుగా స‌మాచారం. సంచ‌ల‌నంగా మారిన రాంప్ర‌సాద్ హ‌త్య ఘ‌ట‌న‌పై సాగుతున్న ద‌ర్యాప్తు తీరును.. ఇత‌ర అంశాలపైనా ఆయ‌న ఆరా తీసిన‌ట్లుగా తెలుస్తోంది.