Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ లో చంద్రబాబుకు డీజీపీ జలక్

By:  Tupaki Desk   |   18 Aug 2020 3:45 AM GMT
ఫోన్ ట్యాపింగ్ లో చంద్రబాబుకు డీజీపీ జలక్
X
ఫోన్ ట్యాపింగ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా డీజీపీ లేఖ రాయడం సంచలనమైంది. ఇందులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం అనూహ్యం మలుపుగా రాజకీయవర్గాలు అభివర్ణిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్న చంద్రబాబు.. రాజ్యాంగంలోని 19,21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురి అవుతున్నట్లు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాధారాలు ఉంటే తమకు అందజేయాలని కోరారు. తాము ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని డీజీపీ తెలిపారు. దీనిపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని.. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలిసిందన్నారు.