Begin typing your search above and press return to search.
మే 31 వరకు విమానాలు ఎగరవు: డిజిసిఎ!
By: Tupaki Desk | 21 April 2020 7:30 AM GMTభారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించింది. లాక్ డౌన్ కారణంగా వాహన సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం అన్ని విమాన సర్వీసులు కూడా రద్దు చేసింది. అయితే , మొదటిదశ లాక్ డౌన్ తరువాత అంటే ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ను ఎత్తేస్తారు అని కొన్ని విమానయాన సంస్థలు బుకింగ్స్ ను ప్రారంభించాయి. కానీ, దేశంలో కరోనా కంట్రోల్ లోకి రాకపోవడంతో మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. మే 3 వరకు ఈ రెండవదశ లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే అది మే 31 వరకు కొనసాగనుంది.
అయితే, ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తరువాతనే విమానయాన సంస్థలు బుకింగ్స్ ను ప్రారంభించాలని డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన డిజిసిఎ - మే 3 వరకు విమానాల టికెట్ బుకింగ్ నిలిపివేయాలని ప్రకటించింది. పౌర విమానయాన శాఖ ఆదేశాన్ని ధిక్కరించి విమానయాన సంస్థలు ఆదివారం నుంచి బుకింగ్ ప్రారంభించాయి. ప్రయాణీకుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పౌర విమానయాన విభాగం విమానయాన సంస్థల నుండి వివరణ కోరింది. లాక్ డౌన్ వల్ల రద్దు చేయబడిన టికెట్ డబ్బును తిరిగి చెల్లించకుండా - ఇండియన్ ఎయిర్ లైన్స్ కంపెనీ తదుపరి విమానానికి క్రెడిట్ వోచర్లు జారీ చేసిందని వినియోగదారులు సోషల్ నెట్ వర్క్ సైట్లలో ఫిర్యాదు చేశారు.
మార్చి 25 నుండి మే 3 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవద్దు అని సివిల్ ఏవియేషన్ విభాగం వినియోగదారులకు సూచించింది. అయితే, రద్దు చేయబడిన టికెట్స్ మొత్తం డబ్బు తిరిగి ఇవ్వబడుతుందా లేదా అని పౌర విమానయాన శాఖ చెప్పలేదు. అలాగే డిజిసిఎ ఆదేశాల మేరకు మే 31 వరకు అన్ని రకాల దేశీయ - అంతర్జాతీయ విమానయాన టిక్కెట్ల బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు విమానయాన సంస్థలు ప్రకటించాయి.