Begin typing your search above and press return to search.
జమ్మూకాశ్మీర్ జైళ్ల శాఖ డీజీ దారుణ హత్య: చచ్చిపోతానంటున్న నిందితుడు
By: Tupaki Desk | 4 Oct 2022 11:35 AM GMTజమ్ముకశ్మీర్ లో దారుణం జరిగింది. ఆ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురికావడం సంచలనమైంది. పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోహియా హత్యపై దర్యాప్తు ప్రారంభించారు. డీజీ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి కనిపించకపోవడంతో అనుమానించి గాలింపు చర్యలు చేపట్టారు.
జైళ్ల డీజీ లోహియాను గొంతుకోసి కిరాతకంగా చంపిన హంతకుడు.. ఆయన శరీరాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఊపిరాడకుండా చేసి సీసాతో గొంతు కోశారు. ఇది అత్యంత దారుణ పాశవిక సంఘటనగా ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.
డీజీ హేమంత్ లోహియా హత్యకేసులో పోలీసులు అనుమానిస్తున్న వ్యక్తి ఆయన ఇంట్లో పనిచేసే 'యాసిర్' గా గుర్తించారు. జమ్మూకశ్మీర్ లోని రాంబాన్ జిల్లాకు చెందిన వాడిగా ఇతడిని గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతగాడి కోసం నిందితులు గాలింపు చర్యలు చేపట్టారు.
జమ్మూలోని తన ఇంటి నిర్మాణ పనుల నేపథ్యంలోనే తన స్నేహితుడైన 'రాజీవ్ ఖజారియా' ఇంట్లో హేమంత్ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే లోహియాను పనిమనిషిగా చేస్తున్న యాసిర్ హతమార్చాడు. నిందితుడు లోహియాను ఎందుకు హతమార్చాడు? అతడి వెనుక మరెవరైనా ఉన్నారా? నిందితుడికి లోహియాకు మధ్య మరేమైనా వివాదాలు ఉన్నాయా? వంటి కోణాలలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
పరారీలో ఉన్న నిందితుడు యాసిర్ ఫొటోను పోలీసులు తాజాగా విడుదల చేశారు. నిందితుడు డిప్రెషన్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలోనే తన గదిలో నోట్ రాసి పెట్టుకున్నాడు. 'తాను చావును కోరుకుంటున్నానని.. నన్ను క్షమించండి నాకు ప్రతీరోజు ఓ చెడ్డ రోజుగా మారింది' అని రాశాడు.
దీన్ని బట్టి నిందితుడు యాసిర్ ఈ హత్యను డిప్రెషన్ లో చేశాడా? లేక ఇతడి చేత ఎవరైనా బలవంతంగా ఒత్తిడి చేయించి చంపించారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతడు దొరికితే కానీ ఇలాంటి వాటికి సమాధానాలు దొరకవు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.