Begin typing your search above and press return to search.
టీటీడీ తప్పుల్ని ఎత్తి చూపిన శ్రీవారిభక్తులకు పోలీసు మార్కు ట్రీట్ మెంట్!
By: Tupaki Desk | 14 Jan 2022 2:56 PM GMTడబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుమలకు వెళ్లేది ఎందుకు? శ్రీవారిని కాసేపు దర్శించుకోవాటికే తప్పించి.. గొడవలు పడటానికి కాదుగా? అసలు గొడవలు పెట్టుకోవటానికి అల్లంత దూరాన ఉన్న తిరుమలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. కానీ.. అవేమీ తిరుమల పోలీసులకు కనిపించని పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ పోలీసుల మీద విమర్శలు వినిపిస్తున్న సందర్భాన.. తాజాగా తిరుమలలో శ్రీవారి భక్తలు విషయంలో కొండ మీద పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల దర్శనం కోసం ఎదురుచూసిన భక్తులకు ఎదురైన చేదు అనుభవాల్ని వారు మర్చిపోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తాము దర్శనానికి టికెట్లు తీసుకొనిలోపలకు వెళ్లామని.. మూడు గంటలకు దర్శనమవుతుందని చెప్పి.. ఎనిమిది గంటల పాటు కూర్చోబెట్టేశారని.. అన్నేసి గంటలు కూర్చోబెట్టినప్పుడు.. తినటానికి.. తాగటానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుండేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. గంటల కొద్దీ క్యూ లైన్లో ఉండిపోయిన వారు.. పిల్లలు ఆకలితో సతమతమవుతుంటే.. పట్టించుకునే దిక్కే లేదని వాపోయారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు.. స్వామి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. టీటీడీ తీరును తప్పు పడుతూ నినాదాలు చేశారు. సాధారణంగా క్యూలైన్లలో గోవింద నామస్మరణ తప్పించి మరింకేమీ వినిపించవు. అందుకు భిన్నంగా ఆకలి కేకలు.. ఆగ్రహాపు ఆవేశాలు కనిపించాయి. నిజానికి ఇలాంటివి చాలా.. చాలా అరుదుగా చోటుచేసుకుంటాయి.
అలాంటి అసాధారణ పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు టీటీడీ అధికారులు స్పందించి.. భక్తుల అవసరాల్ని తీర్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతారు. అందుకు భిన్నంగా ఈసారి ఆగ్రహం వ్యక్తం చేసే భక్తుల్ని పోలీసులు తీసుకెళ్లటం.. టీటీడీ తీరును తప్పు పడుతూ మాట్లాడే వారిని భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని కొందరు మాటల్లోనూ వినిపించటం గమనార్హం.
తమకంటే రూ.300 టికెట్ల మీద దర్శనానికి వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని.. వారంతా ఒకటిన్నర గంటల సమయంలో వచ్చారని.. ఇప్పటికి వారికి దర్శనం దిక్కులేదని చెప్పారు. వీవీఐపీల దర్శనాల్ని తగ్గించి.. సామాన్యుల బాగు కోసం ప్రయత్నించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదంటున్నారు. భక్తుల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును పులువురు తప్పు పడుతున్నారు.
మొత్తంగా చూస్తే.. టీటీడీ అధికారుల ప్రణాళిక లోపాన్ని కవర్ చేసేందుకు పోలీసులు వ్యవహరించిన తీరు ‘అతి’గా ఉందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మిగిలిన చోట్ల సంగతి వేరు. తిరుమలకు వచ్చేది కేవలం స్వామి వారి దర్శనం కోసమే. అలాంటి వారి పట్ల మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం అందరి మీదా ఉంది. లేకుంటే.. కొండ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు.