Begin typing your search above and press return to search.

భద్రాద్రి రామన్నకు అపచారం జరిగిందట

By:  Tupaki Desk   |   7 March 2017 5:10 AM GMT
భద్రాద్రి రామన్నకు అపచారం జరిగిందట
X
నిర్లక్ష్యం.. అలసత్వంతో వ్యవహరించే వారి కారణంగా సంప్రదాయంగా జరగాల్సిన కార్యక్రమాలు జరగకపోవటమే కాదు.. కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసే ఉదంతాలు చోటు చేసుకోవటం తెలిసిందే. తాజాగా అలాంటి ఉదంతమే ప్రముఖ అధ్యాత్మిక కేంద్రం.. భద్రాద్రి రామాలయంలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం.. మూలవిరాట్టును అన్యులెవరో తాకకూడదు.

అయితే.. స్వామిని దర్శించుకునే సమయంలో విదుల్ని పక్కాగా నిర్వహించాల్సిన అర్చకుల తీరు కారణంగా.. భక్తులు మూలవిరాట్టును తాకేసి అపచారానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులునేరుగా మూలవిరాట్టు వద్దకు వెళ్లి.. స్వామిని తాకిన వైనం తాజాగా బయటకువచ్చింది. అయితే.. మూలవిరాట్టు వద్దకు వెళ్లిన భక్తులకు తాము చేసింది తప్పన్న విషయం తెలియదని.. వారికి అవగాహన లేకపోవటం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు.

ఈ తప్పు జరగటానికి కారణం ఆలయ సిబ్బంది.. ఆర్చకులేనని తేలుస్తున్నారు. మూలవిరాట్టును తాకి.. అపచారం జరిగిన ఘటనను ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్లారు. స్వామి సేవలో తరించాలన్న అతృతలో భక్తులు అలా వ్యవహరించి ఉంటారని.. కానీ వారిని నిలువరించాల్సిన ఆర్చకులు.. ఆ సమయంలో అక్కడ ఉండకపోవటంతో ఈ ఘటన చోటు చేసుకుందని.. ఈ మధ్య కాలంలో ఇలాంటివి తరచూ జరుగుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు.విధులు నిర్వర్తించాల్సిన వేళ.. ఆర్చకులు స్వామి వారి దగ్గర లేకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఉదంతంపై పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారికి అపచారం జరిగేంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/