Begin typing your search above and press return to search.
బాబు దగ్గర మార్కులు కొట్టాలంటే ఇదే దారి!
By: Tupaki Desk | 19 July 2017 4:03 AM GMTఇటీవల విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రం చూశారా? అందులో కమెడియన్ పృథ్వీ మామ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త దొంగమార్గాలు వెతుకుతూ - మాయమాటలు చెబుతూఉంటాడు. ప్రతిసారీ.. తనకు ఎన్ని మార్కులు పడ్డాయో, ఏది బెడిసికొట్టి ఎన్ని మార్కులు పోయాయో.. బేరీజు వేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రకారం చూస్తే.. నీటివనరుల మంత్రి దేవినేని ఉమాకు చంద్రబాబునాయుడు వద్ద మంగళవారం నాడు ఫుల్ మార్కులు పడిపోయినట్టే. ఎలాగంటారా...?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర మార్కులు కొట్టేయాలంటే.. ఆయన కేబినెట్ లోని మంత్రులు ఒక అడ్డదారి కనుక్కున్నారు. తమ ప్రత్యర్థి జగన్మోహనరెడ్డిని దారుణంగా తిట్టిపోస్తే అంతే చాలు. చంద్రబాబు మీద తమలో ఉన్న భక్తి కంటె, జగన్ మీద ఉన్న ద్వేషం ఎక్కువ అన్నట్లుగా బిల్డప్ ఇస్తే చాలు.. చంద్రబాబు పొంగిపోతాడని వారు అనుకుంటున్నట్లుగా ఉంది. ఇందుకు నిదర్శనం మంగళవారం దేవినేని ఉమా నిర్వహించిన విలేకర్ల సమావేశమే.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగాల్సిన కేబినెట్ సమావేశం షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కావాల్సి ఉంది. కానీ దేవినేని ఉమామహేశ్వరరావుకు దానికంటె జగన్ ను తిట్టిపోయడమే ఇంపార్టెంట్ సంగతిగా కనిపించింది. మధ్యాహ్నం దాదాపు 3.40 గంటల వరకు ఆయన ప్రెస్ మీట్ సాగుతూనే ఉన్నది. ఆయన జగన్ ను ఆడిపోసుకుంటూనే ఉన్నారు.
అంత అర్జంటుగా మంత్రివర్గ సమావేశం ప్రయారిటీని మించి.. మంత్రిగారు ఏమైనా కొత్త విషయాలు వెల్లడించారా...? అంటే ఎంతమాత్రమూ లేదు. పట్టిసీమ కట్టేశాం.. ఆ పుణ్యమాని సీమ ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నాం వంటి పాతచింతకాయ పచ్చడి ప్రసంగమే తప్ప.. మరొక్క సంగతి లేదు. ఆయన తీరు చూసిన వారు మాత్రం.. కేబినెట్ భేటీకి వెళ్లేముందు జగన్ ను ఎడాపెడా తిట్టేసి వెళ్తే.. చంద్రబాబు ప్రశంసలు పొందవచ్చునని ఉమా కలగంటున్నట్లు ఉన్నదని వ్యాఖ్యానించారు. బాబును కూడా పట్టించుకోకుండా జగన్ ను తిడుతూ ఉంటే.. బాబు వద్ద మంచి మార్కులు పడతాయని వారు ఒక ఒపీనియన్ కు వచ్చినట్లే ఉన్నది.