Begin typing your search above and press return to search.
దేవినేని ఉమ మైనస్ పాయింట్లు అవేనా?
By: Tupaki Desk | 28 April 2019 2:30 PM GMTచంద్రబాబు నాయుడి కేబినెట్ లో మంత్రిగా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అత్యంత ఘాటుగా స్పందించిన వారిలో ఒకరు దేవినేని ఉమా మహేశ్వరరావు. ‘జగన్..’అంటూ వైఎస్సార్సీపీ అధినేతను ఏక వచనంలోనే సంబోధిస్తూ తరచూ విమర్శలు చేసే వారు ఉమ. జగన్ కు రకరకాల సవాళ్లు విసిరేవారు.
అయితే ఆ సవాళ్లలో ఉమ వేటినీ నెరవేర్చుకోలేకపోయారు. అంతే కాదు జగన్ ను పులివెందుల్లో ఓడిస్తామంటూ కూడా దేవినేని ఉమ సవాల్ విసిరారు. ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ మైలవరంలో ఆయన పరిస్థితి ఏమిటి? ఈ ఎన్నికల్లో ఆయన గెలుస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం.
ఇప్పటికే పోలింగ్ పూర్తి అయిపోయిన తరుణంలో గెలుపోటముల గురించి గట్టిగా చర్చ లో నిలుస్తున్న నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఒకటి. ఇక్కడ దేవినేని ఉమకు కొన్ని మైనస్ పాయింట్లు ఉన్న వైనాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
-రొటీన్ గా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత మైలవరంలో కూడా ఉండనే ఉంటుంది.
-ఈ నియోజకవర్గంలో మామూలుగా అయితే వైఎస్సార్సీపీ ఆశలు పెట్టుకునేది కాదేమో. దేవినేని ఉమకు బలమైన ప్రత్యర్థిని నిలబెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
-నియోజకవర్గంలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి వసంత కృష్ణ ప్రసాద్ బాగా పని చేసుకొంటూ వచ్చారు.
-అయినా దేవినేని ఉమను ఇక్కడ ఓడించడం తేలికైన పని కాదు. రెండు సార్లు ఆయన వరసగా నెగ్గారు.
-అయితే వసంత కృష్ణ ప్రసాద్ పోలీసులకు లంచాలు ఇవ్వజూపారంటూ కేసులు నమోదుచేయించడం వివాదాస్సదంగా మారింది.ఆ కేసులు కావాలని పెట్టించారనే ప్రచారం.. వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సానుభూతిగా మారిందని స్థానికంగా వినిపిస్తున్న మాట.
-ఇక అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్టుగానే మైలవరంలో కూడా ఇసుక ర్యాంపులు - జన్మభూమి కమిటీలు - అధికార పార్టీ వాళ్ల ఇతర దందాలు ఉండనే ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మైలవరం ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకంగా మారింది. మంత్రులపై ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగా పని చేస్తుందనేది సహజమైన రాజకీయ అంశం.ఇలాంటి నేపథ్యంలో..మైలవరంలో దేవినేని ఉమకు ప్లస్ లకు తోడుగా మైనస్ లూ గట్టిగానే ఉన్నట్టున్నాయి. ఇక్కడ అసలు కథ ఎలా ఉంటుందనేది మే ఇరవై మూడున తేలాల్సిందే!