Begin typing your search above and press return to search.

టీడీపీ తో దేవినేని బంధం.. తెగి పోయినట్టే..

By:  Tupaki Desk   |   15 Nov 2019 6:44 AM GMT
టీడీపీ తో దేవినేని బంధం.. తెగి పోయినట్టే..
X
దేవినేని నెహ్రూ.. కృష్ణ జిల్లా రాజకీయాల ను శాసించిన నేత. టీడీపీ అంటే దేవినేని ఫ్యామిలీ అన్నంత గా పార్టీ లో కొన సాగుతూ ప్రఖ్యాత పొందారు. ఆయన వారసుడు దేవినేని అవినాష్ కూడా ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీ లోనే అన్నారు. కానీ సడన్ గా చంద్రబాబు, లోకేష్ ల తీరు నచ్చక బయట కు వచ్చేశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి కి, టీడీపీ కి రాజీనామా చేసి జగన్ సమక్షం లో గురువారం వైసీపీ లో చేరి పోయారు. ఆయనతో పాటు మరో నేత కడియాల బుచ్చి బాబు కూడా వైసీపీ లో చేరారు. దేవినేని, టీడీపీ బంధానికి బీటలు వారడానికి అసలు కారణమేంటి? ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయాన్ని అవినాష్ తీసుకున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దేవినేని ఫ్యామిలీ కి కృష్ణా జిల్లా లో మంచి ఫాలోయింగ్ ఉంది. తండ్రి బాట లోనే అవినాష్ కూడా రాజకీయాల్లో చురుకు గా ఉంటూ వస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడాక అవినాష్ లో అంతర్మథనం మొదలైందట.. అయితే కొద్ది రోజులే కింద తాను ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీ లోనే ఉంటానని ప్రకటించిన అవినాష్ వ్యవహారం మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత కరుడు గట్టిన టీడీపీ వాది మళ్లీ మనసు మార్చుకొని వైసీపీలో చేరడమే టీడీపీ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.

అవినాష్ వైసీపీ లో చేరడం కృష్ణ జిల్లా లో కాక రేపుతోంది. టీడీపీ లో అవినాష్ కు ప్రాధాన్యం లేక పోవడం.. ఓడిపోయే సీటు ను చంద్రబాబు ఇవ్వడమే ఆయన లోని కోపాని కి కారణం గా అభివర్ణిస్తున్నారు. యువ నాయకుడు కావడం తో పార్టీ సిద్ధాంతాలు, ప్రేమలు పక్కనపెట్టి భవిష్యత్ కోసమే వలస బాట పట్టారు.

నిజానికి మొన్నటి ఎన్నికల్లో అవినాష్ విజయవాడ తూర్పు, లేదా పెనమలూరు టికెట్ ఆశించారు. అక్కడ దేవినేని నెహ్రూ కు అభిమానులున్నారు. కానీ చంద్రబాబు గుడివాడ సీటు ఇచ్చి కొడాలి నానిపై పోటీకి దింపడమే అవినాష్ ను బాధించింది. ఎన్నికల్లో ఓడి పోవడంతో టీడీపీలో ఉండలేక చివరకు కార్యకర్తలు, అనుచరుల తో సమాలోచనలు చేసి టీడీపీ కి గుడ్ బై చెప్పారు.

అయితే టీడీపీ ని అభిమానించే నేతనే ఇలా పార్టీ ని వీడడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అంతర్మథనానికి లోను చేస్తోంది. వారు కూడా అవినాష్ బాటలోనే నడుస్తారా లేక కరుడుగట్టిన టీడీపీ వాదులుగా ఉంటారా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొత్తంగా టీడీపీ అంటేనే అవినాష్ లా ఉండే ఈయన నిష్క్రమణ తో తెలుగు దేశం పార్టీ లో అల్లకల్లోలం మొదలైంది..