Begin typing your search above and press return to search.

టీడీపీకి బిగ్ షాక్‌... దేవినేని అవినాష్ రాజీనామా!?

By:  Tupaki Desk   |   3 Aug 2019 11:37 AM GMT
టీడీపీకి బిగ్ షాక్‌... దేవినేని అవినాష్ రాజీనామా!?
X
బెజ‌వాడ టీడీపీలో ఇప్ప‌టికే నేత‌లు కుమ్మ‌లాడుకుంటుండ‌గా ఇప్పుడు మ‌రో అదిరిపోయే షాక్ త‌గిలింది. ఆ పార్టీ యువ‌నేత‌, ఏపీ టీడీపీ యూత్ విభాగం అధ్య‌క్షుడు అవినాష్ టీడీపీకి రాజీనామా చెయ్యబోతున్నారంట . దివంగ‌త మాజీ మంత్రి దేవినేని నెహ్రూ రాజ‌కీయ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అవినాష్ 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆ ఎన్నిక‌ల్లో అవినాష్‌కు 55 వేల ఓట్లు వ‌చ్చాయి. ఇక ఆ త‌ర్వాత తండ్రితో పాటు టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి మంత్రి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు.

ఇక తాజాగా అవినాష్ అంద‌రికి షాక్ ఇస్తూ టీడీపీకి చెయ్యబోతున్నారంట. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా వెలుగులోకి వచ్చిన ఆయన పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఓడిపోవడంతో తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నారంట . 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినా అప్పుడు కాంగ్రెస్ త‌ర‌పున సీరియ‌స్‌గా కంటెస్టెంట్ చేయ‌లేదు. ఇక అవినాష్‌తో పాటు విజ‌య‌వాడ‌కు చెందిన సీనియర్ టీడీపీ నేత కడియాల బుచ్చిబాబు, పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు రాజీనామా చేస్తారంట . కాగా, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి నాని మీద పోటీ చేసిన అవినాష్.. నానీ ద్వారానే వేరే పార్టీలోనికి మారనున్నట్లు సమాచారం.

ఇక దేవినేని అవినాష్ అనుచ‌రులు కూడా ఆయ‌న వైసీపీలోకి వెళ్లే అంశంపై స్ప‌ష్ట‌త ఇచ్చినట్టే అంటున్నారు . ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జెరూస‌లేం, ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. జగన్ ఈ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అవినాష్ సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అవినాష్‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా వైసీపీలోకి జంప్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక వైసీపీలో చేరితే అవినాష్‌కు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇస్తామ‌ని హామీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇప్పుడు పార్టీ యూత్ వింగ్‌లో రాష్ట్ర స్థాయి అధ్య‌క్షుడిగా ఉన్న అవినాష్ కూడా పార్టీ మారితే కృష్ణా జిల్లాలో టీడీపీకి అదిరిపోయే షాక్ త‌గిలిన‌ట్టే అవుతుంది. మరో వైపు బోండా ఉమ ఇదే తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఆశించే వైసీపీలోనికి వద్దామని అనుకున్నారు. అయితే వైసీపీ నుంచి ఈ విష‌యంలో స్ప‌ష్ట‌మైన హామీ ఆయ‌న‌కు రాలేదంటున్నారు.