Begin typing your search above and press return to search.

దేవినేని అరెస్టు.. వ‌సంత‌కు ప్ల‌స్ అవుతుందా? పొలిటిక‌ల్ డిబేట్!

By:  Tupaki Desk   |   28 July 2021 5:30 PM GMT
దేవినేని అరెస్టు.. వ‌సంత‌కు ప్ల‌స్ అవుతుందా?  పొలిటిక‌ల్ డిబేట్!
X
కృష్ణాజిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. ఇక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృ్ష్ణ ప్ర‌సాద్‌కు ప్ల‌స్ అవుతాయా? టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును ఎట్టి ప‌రిస్థితిలోనూ అరెస్టు చేయిస్తానంటూ.. ఏడాది కింద‌ట శ‌ప‌థం చేశారు.

అయితే.. అప్ప‌ట్లో మంత్రి కొడాలి నాని వ‌ర్సెస్ దేవినేని ఉమా మ‌ధ్య పోరు తీవ్ర‌స్థాయిలో సాగుతు న్న స‌మ‌యంలో వ‌సంత వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పైగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన వ‌సంత అంత‌ప‌ని చేయ‌గ‌లరా? అనే చ‌ర్చ కూడా వ‌చ్చింది. స‌రే.. ఇప్పుడు ఏడాదిపైగానే అయిపోయింది. తాజాగా దేవినేని ఉమాపై జీ.కొండూరు పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం.. ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లిస్తుండ‌డం తెలిసిందే.

మ‌రి ఈ ప‌రిణామం.. వ‌సంత‌కు ఏమేర‌కు క‌లిసి వ‌స్తుంది? ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డ‌తాయా? అనేది ఇప్పుడు వైసీపీలో నే చ‌ర్చ సాగుతోంది. రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య శ‌తృత్వం ఉన్న‌ప్ప‌టికీ.. అది కేవ‌లం మాట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితంగా ఉండేది.

గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లోనూ ఇలాంటి చ‌ర్య‌లు అంటే.. అరెస్టులు చేయించ‌డం.. ఉత్తిపుణ్యానికే హ‌త్యాయ‌త్నం కేసులు పెట్ట‌డాలు వంటివి ఎక్క‌డా చోటు చేసుకోలేదు. `చంద్ర‌బాబు న‌డిరోడ్డుపై కాల్చి చంపినా.. త‌ప్పులేద‌నిపిస్తోంది`-అంటూ.. నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడిగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా.. ఇలాంటి కేసు చంద్ర‌బాబు పెట్ట‌మ‌ని చెప్ప‌లేదు..పోలీసుల‌ను ఆయ‌న ప్రోత్స‌హించ‌నూ లేదు.

కానీ, ఇప్పుడు దేవినేని కారులో కూర్చుని ఉండ‌గానే.. ఆయ‌న‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయ‌డం ఏపీ హిస్ట‌రీలోనే ఒక రికార్డు. ఇక‌, ఇది.. మైల‌వ‌రం ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు ఇప్ప‌టికిప్పుడు ఆనందం అయితే.. క‌లిగించి ఉండొచ్చు. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఆయ‌న సంతోషం వెల్లివిరిసి పార్టీ కూడా చేసుకుని ఉండొచ్చు.

కానీ.. నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో ప‌రిశీలిస్తే.. ఇది తీవ్ర ర‌చ్చ‌కు దారితీస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తాన‌న్న వ‌సంత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశ‌గా అడుగులు వేయ‌లేదు. పైగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో దేవినేనిపై సానుభూతి పెరుగుతోంది. అదేస‌మ‌యంలో ఆయ‌న సామాజిక వ‌ర్గం క‌మ్మ‌ల్లోనూ దేవినేనిపై సానుభూతి ఉంది.

ఈ క్ర‌మంలో దేవినేనిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయ‌డం, వెన్వెంట‌నే ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించ‌డం వంటి ప‌రిణామా ల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. దేవినేని ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో `వసంత ఇలా చేస్తాడ‌ని అనుకోలేదు` అని క‌మ్మ వ‌ర్గంలోనే కామెంట్లు వ‌స్తున్నాయి. సో.. దీనిని బ‌ట్టి.. దేవినేని అరెస్టు.. ఆయ‌న‌కు సానుబూతి పెంచితే.. వ‌సంత‌కు వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో దేవినేని.. ఓడిపోయినా.. వివాదాస్ప‌దం కాలేదు. అవినీతి చేశార‌నికానీ, అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని కానీ.. ఆయ‌న‌పై ఎక్క‌డా మ‌ర‌క‌లు లేవు. ఇక్క‌డి ప్ర‌జ‌లు జ‌స్ట్ ఒక మార్పు కోరుకున్నారు అంతే! అయితే.. ఈ మార్పు.. కార‌ణంగా.. త‌మ‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు ఇక్క‌డివారు. మొత్తానికి దేవినేని అరెస్టుతో వ‌సంత‌కు మార్కులు త‌గ్గిపోవ‌డంతోపాటు.. దేవినేని ప‌ట్ల సానుభూతి పెరిగింద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.