Begin typing your search above and press return to search.

దేవినేని - వల్లభనేని ఇద్దరు కోల్డ్ స్టోరేజ్ నేనా?

By:  Tupaki Desk   |   10 Aug 2020 10:50 AM GMT
దేవినేని - వల్లభనేని ఇద్దరు కోల్డ్ స్టోరేజ్ నేనా?
X
గుడివాడలో కొడాలి నాని మీద పోటీచేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీకి రాంరాం చెప్పి వైసీపీలోకి జంప్ అయ్యాడు. జంప్ అయ్యే ముందు ఇద్దరు మంత్రులు ఇదే దేవినేనిపై ఏపీ సీఎంకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారంట.. అదేంటంటే.. దేవినేని అవినాష్ కు విజయవాడలో యూత్ ఫాలోయింగ్ ఫుల్ గా ఉందని.. అతడిని మనం చేర్చుకుంటే విజయవాడ యూత్ అంతా మన వెంటే ఉంటుందని జగన్ కు ఊదరగొట్టారంట..

దేవినేని వెంట ఉన్నది టీడీపీ యూత్ అని.. పర్సనల్ గా పెద్దగా అతడి దగ్గరికి యువకులు రావడం లేదు అని విజయవాడ వైసీపీ గ్యాంగ్ తమ పరిశీలనలో తేల్చేసిందట.. దేవినేని దగ్గర ఏమీ లేదు అని హైకమాండ్ దగ్గర నిరూపించారని తెలిసింది.

అదే విధంగా వల్లభనేని వంశీపై కూడా ఇప్పుడు అతడి పాత వీడియోలు బాగా ట్రోల్ అవుతున్నాయంట.. జగన్ ని.. వైసీపీని వల్లభనేని తిట్టింది.. గన్నవరంలోని వంశీ వ్యతిరేక బ్యాచ్ ఇప్పుడు విపరీతంగా ఆ వీడియోలను ప్రమోట్ చేస్తున్నారట.. అక్కడున్న బీసీ లీడర్లతో వంశీ తీవ్ర విభేదాలు పెట్టుకున్నాడని సమాచారం. ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం బీసీలకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే వల్లభనేని వంశీ బీసీలను పక్కపెట్టడం తన సొంత వర్గంను పెంచి పోషిస్తున్నాడని సీఎం దగ్గరకు రిపోర్టులు వెళ్లాయని పార్టీలో ప్రచారం సాగుతోంది. త్వరలోనే దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలకు ప్రాధాన్యత తగ్గిస్తారని.. వాళ్ల రాజకీయ జీవితం ఇక కోల్డ్ స్టోరేజీకేనని అక్కడి వర్గాలు అనుకుంటున్నాయి.