Begin typing your search above and press return to search.

టీడీపీ భారీ షాక్‌... యువ‌నేత గుడ్ బై

By:  Tupaki Desk   |   30 Sep 2019 3:14 PM GMT
టీడీపీ భారీ షాక్‌... యువ‌నేత గుడ్ బై
X
టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడైన తూళ్ళ దేవేందర్ గౌడ్ కుమారుడు - టీడీపీ తెలుగు యువ‌త రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద‌ర్‌ గౌడ్ టీడీపీని వీడారు. ఇది తెలంగాణ‌లో టీడీపీ కి పెద్ద షాక్‌గానే చెప్ప‌వ‌చ్చు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రిగా - పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రిగా - ప‌లు శాఖ‌ల‌కు మంత్రిగా ప‌నిచేసిన దేవేంద‌ర్‌ గౌడ్ టీడీపీలో ఓ కీల‌క నేత‌గా ఎదిగారు. ఎన్టీఆర్ తో వ్య‌క్తిగ‌త సంబంధాలు ఉన్న దేవేంద‌ర్ గౌడ్ చంద్ర‌బాబుకు న‌మ్మిన‌బంటుల్లో ఒక‌రు. టీడీపీ పోలిట్‌బ్యూరో స‌భ్యుడిగా చిర‌కాలం ప‌నిచేసిన త‌రువాత కొంత‌కాలం ఆయ‌న టీడీపీ వీడి తెలంగాణ కోసం సొంత కుంప‌టి పెట్టుకుని ప‌నిచేశారు దేవేంద‌ర్ గౌడ్‌. అయితే ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా తెర‌మీదికి వ‌చ్చిన వీరేంద‌ర్‌ గౌడ్ ఇప్పుడు భారీ షాకే ఇచ్చాడు.

టి.టీడీపీ హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోన్న ఈ సమయంలో ఆయ‌న‌ పార్టీకి షాక్ ఇవ్వ‌డం పెద్ద దెబ్బే. తెలుగు యువత అధ్యక్షుడు వీరేందర్‌ గౌడ్. పార్టీ సభ్యత్వం - తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీలో నన్ను ఎంతగానో ఆదరించారు - అవకాశాలు కల్పించారు. అందుకు మీకు నా ధన్యవాదాలు.. సమాజంలో సంపూర్ణ మార్పురావాలన్న దృక్పథంలో నేను రాజకీయాల్లోకి వచ్చాను.. రాజకీయాలలో నాకు స్ఫూర్తి, ఆదర్శం నా తండ్రి దేవేందర్‌ గౌడ్ మరియు మీరు. మీ పరిపాలన దక్షత - కష్టపడే తత్వం నన్ను ఆకర్షించాయి.. మీ నాయకత్వంలో పనిచేసేలా చేశాయని లేఖలో పేర్కొన్నారు వీరేందర్‌గౌడ్.

ఉన్నత ఆదర్శాలు - సిద్ధాంతాలతో స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాయించారు. అయితే కొంతకాలంగా వివిధ రాజకీయ అవసరాల కోసం ఈ సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ రాజీపడింది. ఇది నన్ను ఎంతగానో బాధించింది. పార్టీకి సిద్ధాంతాలు లేకపోవడం అన్నది ఆత్మ లోపించడమే.. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి - తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తన లేఖలో పేర్కొన్నాడు. గ‌త కొంతకాలంగా.. వీరేందర్‌గౌడ్.. బీజేపీలో చేరతానే ప్రచారం సాగుతోంది.. తన తండ్రి దేవేందర్‌ గౌడ్‌ తో కలిసి ఆయన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టైంది.

టీడీపీకి గుడ్‌ బై చెప్పడంతో.. మరీ త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారేమో చూడాలి. రాజ‌కీయాల్లో దేవేంద‌ర్‌ గౌడ్‌ కు ఉన్న అనుభ‌వంతో ఇప్పుడు వీరేంద‌ర్‌ గౌడ్‌ బాట‌లు వేసుకుంటున్న త‌రుణంలో అస‌లు త‌న ప‌య‌నం ఎటో చెప్ప‌క‌నే చెప్పాడు. వీరేంద‌ర్‌ గౌడ్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుంటాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఎందుకో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు బీజేపీలో చేరి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ కు పునాదులు వేసుకుంటాడ‌నే టాక్ వినిపిస్తోంది.