Begin typing your search above and press return to search.
భారత్ దూసుకెళ్తోన్న పది అంశాలివే!
By: Tupaki Desk | 13 Oct 2016 11:00 PM ISTభారత్ వెలిగిపోతుంది అని అప్పట్లో వినిపించిన మాటలు - అయితే నిజంగా కొన్ని విషయాల్లో భారత్ దూసుకెళుతోంది. ఐటీ నుంచి మొదలుపెట్టి ఆర్మీ శక్తిని పెంచుకోవడం - ఇంటర్నెట్ ని ఉపయోగించడం - మౌంటెన్ వార్ ఫేర్ మొదలైన విషయాల్లో భారతదేశం సూపర్ పవర్ గా ఎదుగుతోంది. అయితే... అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రధాన శత్రువైన పేదరికం - ప్రజల్లో పౌష్టికాహారలోపం - నిరక్షరాస్యత లను జయించడంలో కాస్త నెమ్మదిగా పయనిస్తుంది.
* ఐటీ రంగం విషయంలో భారత దేశం శరవేగంగా అభివృద్ది చెందుతూ - ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా వెలుగొందుతోంది. కోటి మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని ఈ రంగం కల్పిస్తుండగా, రెవెన్యూ సైతం అదే రీతిన అందిస్తుంది. దేశంలో ఐటీ-బీపీఎం రంగం విలువ 143 కోట్ల బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అయితే, 2020 కల్లా 650-700 కోట్ల బిలియన్ డాలర్లుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఐటీరంగంలో ఇదే వేగాన్ని భారత్ వచ్చే ఐదేళ్లలోనూ కొనసాగితే... చైనాను దాటేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
* ఇదే క్రమంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు కలిగిన దేశంగా కూడా భారత్ ఉంది. అయితే దేశంలోని మొత్తం జనాహాలో కేవలం 29% మందికే (35.4 కోట్లు) ఇంటర్నెట్ వాడటంవచ్చు. అయినప్పటికీ అమెరికా - జపాన్ - రష్యా వంటి దేశాల కంటే భారత్ ముందుండగా - భారత్ కంటే ముందు ప్రధమ స్థానంలో చైనా కొనసాగుతుంది.
* అణ్వాయుధాల విషయానికొస్తే... గత 67 ఏళ్లలో దేశ అణు ఇంధన సామర్థ్యం బాగా పెరిగింది. థోరియం ఆధారంగా రూపొందించే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల నిర్మాణంలో ప్రపంచంలోనే భారత్ టాప్ ప్లేస్ లో ఉంది. కాగా ఇప్పటివరకూ భారత్ వద్ద 7 న్యూక్లియర్ ప్లాంట్లలో 21 న్యూక్లియర్ రియాక్టర్లు ఉండగా, మరో 6 రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
* ఇక ఆర్మీ విషయానికొస్తే... భూమ్మీద యుద్దం చేయగల దేశాల్లో 11,29,900 యాక్టివ్ ట్రూప్స్ తోనూ - 9,60,000 రిజర్వ్ ట్రూప్స్ తోనూ భారత్ మూడో స్థానంలో ఉండగా - మొత్తం యుద్దం విషయానికొచ్చేసరికి అమెరికా - చైనా - రష్యాల తర్వాత నాలుగో స్థానంలో ఉంది. దీనికి కారణం చైనా - రష్యాలతో పోలిస్తే భారత్ నేవీ శక్తి తక్కువగా ఉండటమే. అయితే, ఇటీవల జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై చాలా మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం అయిన భారత్ ఆర్మీ విభాగంలో మొదటి రెండుస్థానాల్లో లేకపోవడం విచారించాల్సిన విషయం!
* ప్రపంచంలోనే నాలుగో అతి శక్తిమంతమైన పవర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ విభాగంలో భారత్ 1820 ఎయిర్ క్రాఫ్ట్‌లు - 905 కంబాట్ ప్లేన్లు - 595 యుద్ధ విమానాలు - 310 అటాకర్స్ ని కలిగిఉంది. ఈ విషయంలో ప్రపంచంలోనే జర్మనీ - బ్రిటన్ - చాలా యూరోపియన్ దేశాల కంటే భారత్ ముందుంది.
* ప్రపంచవ్యాప్తంగా అంగారక గ్రహం మీద అడుగుపెట్టిన దేశాల్లో భారత్ నాలుగోది కాగా... ఆసియా దేశాల్లో మాత్రం మొట్టమొదటి దేశంగా ఉంది. అయితే... మిగిలిన అన్నిదేశాలకంటే అతి తక్కువ ఖర్చుతోనే మార్స్ (అంగారక గ్రహం) మిషన్ ను చేపట్టటం భారత్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
* న్యూక్లియర్ ప్లాంట్స్ విషయంలో భారత్ ప్రత్యేకమైందనే చెప్పాలి. యూరోనియంతో ఏర్పాటు చేసే న్యూక్లియర్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయం ఏమిటని ప్రపంచమంతా ఆలోచిస్తుండగానే భారత్ థోరియంతో న్యూక్లియర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సరికొత్త అణు ఇంధనంతో ముందుకు వెళుతోంది. న్యూక్లియర్ ప్లాంట్ల ఏర్పాటులో భారత్ యురేనియం కు బదులు థోరియంను వాడటం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడిన సంగతి మనం మరిచిపోకూడదు.
* ఒక దశాబ్దం ముందు వరకూ శాటిలైట్ (ఉపగ్రహ) ప్రయోగాలకు అమెరికా మీద ఆధారపడి, ఫలితంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న భారత్ 2015 వచ్చే సరికి రిమోట్ సెన్సింగ్ సామర్థ్యంలో యూఎస్ ను సైతం దాటేసింది. అయితే దాన్ని ప్రతి రంగంలో ఉపయోగించుకోవడంలో ఇంకా ఎంతో కసరత్తు జరగాల్సి ఉంది. ఈ విషయంలో ఇస్రో కారణంగానే భారత్ ఎంతో ప్రగతి సాధించింది.
* మౌంటెన్ వార్ ఫేర్ విషయంలో ప్రపంచంలోనే భారత్ బెస్ట్. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల ఆర్మీ సైతం కాశ్మీర్ లోని గుల్ మార్గ్ లో ఉన్న శిక్షణా కేంద్రానికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. అణ్వాయుధాలు కలిగిన చైనా, పాకిస్తాన్ లతో భారత్ కు సరిహద్దులు ఉండటం, రెండు వైపులా ఎత్తైన కొండలు ఉండటంతో భారత సైనికులకు మౌంటెన్ వార్ ఫేర్ చాలా అవసరం.
* ఇక యోగా - ఆయుర్వేదం విషయంలో భారత్ విస్తృత పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా యోగాను అభినందిస్తోన్న ఈ తరుణంలో యోగాను చేసేందుకు ఆసక్తి చూపుతోన్న ఈ దశలో వైద్య శాస్త్రంలో సైతం యోగా - ఆయుర్వేద ప్రయోజనాలపై భారత్ ఎన్నో పరిశోధనలు చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/