Begin typing your search above and press return to search.

మాల్యాను టార్గెట్ చేయొద్దంటున్న మాజీ ప్రధాని

By:  Tupaki Desk   |   12 March 2016 6:23 PM GMT
మాల్యాను టార్గెట్ చేయొద్దంటున్న మాజీ ప్రధాని
X
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.9వేల కోట్ల రూపాయిల్ని ఎగొట్టి దేశం విడిచి వెళ్లినపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తీరుపై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు.. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి కూడా. పదుల సంఖ్యలో బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన ఆయన వైఖరిపై విమర్శలు వ్యక్తం కావటంతో పాటు.. బ్యాంకుల తీరుపైనా పలువురు మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. మాల్యాపై చేస్తున్న విమర్శలపై మాజీ ప్రధాని.. కర్ణాటకకు చెందిన దేవగౌడ్ తప్పు పట్టటం విశేషం. జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు దేవగౌడ మాల్యాకు మద్దతుగా నిలవటం విశేషం. దేశం నుంచి పారిపోయినట్లుగా చేస్తున్న విమర్శలు తప్పు పట్టిన దేవగౌడ.. ఈడీ ఇచ్చిన నోటీసులకు మాల్యా ఇప్పటికే బదులిచ్చారన్నారు.

మాల్యాను అందరూ తిట్టిపోస్తున్న వేళ.. దేవగౌడతో పాటు.. జమ్మూకాశ్మీర్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దాల్లా కూడా సపోర్ట్ గా నిలవటం విశేషం. బ్యాంకుల్ని ముంచిన వైనం ఈ ఇద్దరి నేతలకు తప్పుగా కనిపించకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మరింది. వైమానిక సంస్థలు నష్టాల్లో ఉన్నాయని.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్త అయిన మాల్యాను అనుమానాల్సించిన అవసరం లేదంటూ దేవగౌడ వ్యాఖ్యానించటం గమనార్హం. ఒకవేళ నిజంగానే అప్పులు పాలైతే.. బాధ్యతగా సమాధానం చెప్పాలే కానీ.. చెప్పాపెట్టకుండా 11 భారీ లగేజ్ లతో గుట్టు చప్పుడు కాకుండా జంప్ కావటం ఎందుకో..?