Begin typing your search above and press return to search.

నారా లోకేష్ కుమారుడికి అన్న‌ప్రాస‌న‌

By:  Tupaki Desk   |   17 Oct 2015 6:31 AM GMT
నారా లోకేష్ కుమారుడికి అన్న‌ప్రాస‌న‌
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు కుటుంబంలో ద‌సరా కంటే ముందే మ‌రో కీల‌క పండ‌గ జ‌ర‌గ‌నుంది. చంద్ర‌బాబు కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ అన్నప్రాసన వేడుక క‌లియుగ దైవం తిరుమ‌ల వెంక‌న్న స‌న్నిధిలో జ‌ర‌గ‌నుంది. ఆదివారం ఈ కార్య‌క్ర‌మం నారా-నంద‌మూరి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నుంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముందుగా సొంతూరు నారావారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. అయితే అనివార్య కారణాలతో వేదిక తిరుమలకు మారింది. రేపు తిరుమలలో జరగనున్న ఈ వేడుకలో నారా లోకేశ్, చంద్రబాబు దంపతులతో పాటు నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా పాల్గొన‌నున్నారు. ద‌స‌రా పండ‌గ సంద‌ర్బంగా రాష్ర్టంలో వేడుక‌ల కోలాహ‌లానికి తోడు అమ‌రావ‌తి శంఖుస్థాప‌న సంద‌డి సాగుతుండ‌గా...ఇపుడు దేవాన్ష్ అన్న ప్రాస‌న తెలుగుత‌మ్మ‌ళ్ల‌తో పాటు ఏపీ ప్ర‌జ‌ల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.