Begin typing your search above and press return to search.
ఎన్నికలకి మా వద్ద డబ్బుల్లేవ్ ... మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 11 Feb 2021 5:30 AM GMTమరికొద్ది రోజుల్లోనే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ త్వరలో ఈసీ విడుదల చేయబోతుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక లో కూడా బెల్గాం లోక్ సభతో పాటు బసవకళ్యాణ్, సింధి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే .. ఈ స్థానాల్లో ఎన్నికలకి ఏక్షణంలో అయినా ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు కూడా తమ వ్యూహాలని సిద్ధం చేసుకుంటున్నారు. ఐతే జేడీఎస్ మాత్రం తాము ఎన్నికల్లో పోటీచేయబోమని ప్రకటించింది. పార్టీకి ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నాయని.. అందుకే ఎన్నికల్లో పోటీచేయడం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. బెలగాం లోక్‌సభతో పాటు బసవకల్యాణ్, సిందగి, మస్కి అసెంబ్లీ స్థానాల్లో జేడీఎస్ అభ్యర్థులను నిలపడం లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మా వద్ద డబ్బు లేదు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కింది స్థాయి కార్యకర్తలతో కలిసి పనిచేస్తాం. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తాం అని దేవెగౌడ ప్రకటించారు.
ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవేగౌడ చేసిన ప్రకటనను రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉపఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఇక ఉపఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు జేడీఎస్ పోటీ నుంచి తప్పుకుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.