Begin typing your search above and press return to search.
ఈవీఎంలపై హర్దిక్ సెటైర్...ఈసీ కౌంటర్
By: Tupaki Desk | 18 Dec 2017 4:32 PM GMTగుజరాత్ ఎననికల ఫలితాలపై పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ సెటైర్ వేశారు. ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి శుభాకాంక్షలు అని ఎద్దేవా చేశారు. గుజరాత్ ఫలితాలు దాదాపు వెలువడిన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. సూరత్, రాజ్‌కోట్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని దుయ్యబట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అతిపెద్ద సమస్య అని పేర్కొంటూ దానిపై విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని హార్దిక్ పిలుపునిచ్చారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంలను వాడటం లేదని.. మనదేశంలో అవి అవసరమా? అని హర్దిక్ పటేల్ ప్రశ్నించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కానని.. పాటిదార్ల రిజర్వేషన్ ఉద్యమాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా, ఈవీఎంలను ట్యాంపర్ చేశారు. అందుకే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్ట్ అవుతున్నదని గుజరాత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు ఫిర్యాదు కూడా చేశారు.
ఇదిలాఉండగా... ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించిన మాజీ అధికారులు ఈ విషయంపై ఇవాళ కొంత స్పష్టతను ఇచ్చారు. ఈవీఎంలను - వీవీప్యాట్ లను ట్యాంపర్ చేయలేమని సీఈసీ మాజీ చీఫ్ హెచ్ ఎస్ బ్రహ్మ తెలిపారు. ఈ అంశంపై గతంలో అనేకసార్లు పరీక్షలు నిర్వహించామని, ఇక దాని గురించి ఆలోచించడం మానివేయాలన్నారు. ఈవీఎం ఓ మెషీన్ అని - దాన్ని హ్యాక్ చేయడం కుదరదని బ్రహ్మ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయలేరని సీఈసీ మాజీ చీఫ్ నవీన్ చావ్లా తెలిపారు. గతంలో బీజేపీ కూడా ఈవీఎంల అంశంపై అనుమానాలు వ్యక్తం చేసిందని, అప్పుడు కూడా ఈవీఎంల పనితీరుపై ప్రదర్శనలు నిర్వహించామని, వాటిని ట్యాంపర్ చేయలేమని నవీన్ చావ్లా అన్నారు. ఈవీఎంలు దేనికి కనెక్ట్ కావు అని సీఈసీ మాజీ చీఫ్ ఎన్ గోపాలస్వామి అన్నారు. బ్లూటూత్, వైర్‌లెస్‌తో ఈవీఎంలను ట్యాంపర్ చేయలేమన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోలా ఆరోపణలు చేస్తున్నది. ప్రజల ఓట్ల వల్ల కాదు, బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్ల గెలిచిందని ముంబై కాంగ్రెస్ చీప్ సంజయ్ నిరుపమ్ ఆరోపించారు.