Begin typing your search above and press return to search.
వారసుల లిస్ట్ రెడీ... జగన్ టిక్కు పెట్టేది ఎవరికి...?
By: Tupaki Desk | 23 May 2023 8:00 AM GMTశుభమాని బందరు పోర్టుకు సీఎం హోదాలో జగన్ శ్రీకారం చుట్టిన వేళ ఈ రాజకీయం ఇంతటితో సమాప్తం అనేశారు మాజీ మంత్రి జగన్ కి అత్యంత ఆప్తుడు అయిన పేర్ని నాని. వెటకారం డాట్ కాం గా పేరు పొందిన పేర్ని నాని జగన్ టీం లో అతి ముఖ్యుడు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ని కట్టడి చేయాలంటే జగన్ వైపు నుంచి ఆయనే పదునైన అస్త్రం.
గుక్కతిప్పుకోకుండా జనసేనానిని టార్గెట్ చేస్తూ గంటలతరబడి మీడియా ముందు అలుపు లేకుండా మాట్లాడగల దిట్ట. ఇక కోస్తా జిల్లాల్లో బలమైన కాపు నేత. దూకుడు రాజకీయం చేస్తారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు దశాబ్దాల కాలం అనుభవం సొంతం. టీడీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వైసీపీకి ఉన్న బలమైన నేత.
అలాంటి పేర్ని నాని నేను రిటైర్ అవుతున్నాని అని మనసులో మాట జనాల సాక్షిగా జగన్ సాక్షిగా కూడా చెప్పేశారు. జగన్ తో చివరి మీటింగ్ అనేశారు. పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయలనుకుంటున్నాడు. గడప గడపకూ అతనే తిరుగుతున్నారు.
దీని మీద అప్పట్లో వర్క్ షాప్ లో జగన్ పేర్ని నాని సహా కొందరు నేతలకు వారసులు వద్దు, మీరే పోటీ చేయండి అని సూచించారు అని వార్తలు వచ్చాయి. అయినా ఇపుడు నేను రాజకీయాల్లో ఉండను అని జగన్ ఎదుటనే నాని చెప్పారూ అంటే అందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.
వారసుల జాబితాలో చూస్తే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండవ సీటుగా దీన్ని చూస్తున్నారు. ఇంతకు ముందు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా పోటీ చేసేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ ఉంది. ఇక ఇదే చిత్తూరు నుంచి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నరు. ఆ వారసుడిని ఓకే చేయాల్సి ఉంది.
అలాగే కర్నూల్ జిల్లాలోని డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. చిత్తూరు జిల్లా నెల్లూరు గంగాధర నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తన కుమార్తెకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆయన సోదరుడి కుమారుడికి టికెట్ కోరుతున్నారు.
శ్రీకాకుళం నుంచి చూస్తే తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన క్రిష్ణ దాస్, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి కుమారుడు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ కుమారుడు, చాన్స్ ఉంటే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె టికెట్లు కావాలని కోరుతున్నారు. విశాఖ నుంచి చూస్తే ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు తన కుమారుడు సుకుమార వర్మకు టికెట్ అడుతున్నారు. బూడి ముత్యాలనాయుడు తన కుమార్తె కోసం ట్రై చేస్తున్నారు.
పాయకరావుపేట నుంచి గొల్లబాబూరావు కూడా వారసుడికి టికెట్ అడుగుతున్నారని టాక్. విశాఖ జిల్లాలో చూస్తే గాజువాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడికి టికెట్ డిమాండ్ చేస్తున్నారు. పాడేరు టికెట్ ని తన కుమార్తె కు ఇవ్వాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అర్జీ పెట్టుకున్నారని టాక్. అదే విధంగా గోదావరి జిల్లా నుంచి కూడా పలువురు టికెట్ తమకు కాకుండా తమ వారసులకు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇలా ఒకరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు మొత్తం తేనే తుట్టెను కదిపినట్లుగా వారసులు అంతా బిలబిలమని బయటకు వచ్చేస్తున్నారు. జగన్ అయితే ఈ ఎన్నికలు చాలా సీరియస్ గా సాగుతాయి కాబట్టి సీనియర్లు అంతా పోటీలో ఉండాలని ఆ మధ్యన స్పష్టం చేశారు. జగన్ కనుక వత్తిడిలకు లొంగితే జూనియర్లు చాలా చోట్ల వస్తారు. వారిని గెలిపించుకునే సత్తా తండ్రులకు లేకపోయినా లేక వారి కాలిబర్ సరిపోకపోయినా వైసీపీకి అది భారీ నష్టాన్ని తెస్తుందని అంటున్నారు. మరి జగన్ ఈ విషయంలో అందరికీ ఒకే రూల్ అంటారా లేక కొందరికే ఈ ఆఫర్ ప్రకటిస్తారా చూడాల్సి ఉంది.