Begin typing your search above and press return to search.
సైలెంటుగా చంద్రబాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 9 April 2016 10:10 AM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త సంవత్సరంలో సరికొత్త షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలో చేరిపోగా మరికొందరు చేరుతారంటూ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే... చడీచప్పుడు లేకుండా ఓ వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబును కలిసి వచ్చారు. దీంతో ఆ ఎమ్మెల్యే కూడా టీడీపీలో కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది.
జగన్ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. శనివారం ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి చేరుకున్నారు. మదనపల్లిలో చంద్రబాబు కాలు మోపగానే... దేశాయి తిప్పారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. వైసీపీ టికెట్లపై విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల టీడీపీలోకి చేరుతున్న క్రమంలో చంద్రబాబుతో తిప్పారెడ్డి భేటీ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకే తెర తీసింది. పార్టీ మారుతున్నట్లు తిప్పారెడ్డి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకున్నా, చంద్రబాబుతో ఆయన భేటీ పార్టీ మారే క్రమంలో జరిగిందేనన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు చిత్తూరు జిల్లాలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. అందుకోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ చక్రం తిప్పుతున్నట్లుగా సమాచారం.