Begin typing your search above and press return to search.

డేరా చీఫ్ జైలు నుంచి విడుదల.. జడ్ ప్లస్ భద్రత

By:  Tupaki Desk   |   23 Feb 2022 2:30 AM GMT
డేరా చీఫ్ జైలు నుంచి విడుదల.. జడ్ ప్లస్ భద్రత
X
పలు కేసుల్లో దోషిగా నిర్ధారణ అయ్యి.. జైలు శిక్ష కూడా అనుభవిస్తున్న డేరా చీఫ్ రామ్ రహీమ్ సిక్కుల గురుకు బీజేపీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశమైంది. వివాదాస్పద ఈ సిక్కుల గురువును ఇటీవలే బయటకు వదిలారు.

20 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న డేరా చీఫ్ కు ఇటీవలే 21 రోజుల పెరోల్ ను హర్యానా ప్రభుత్వం ఇచ్చింది. ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అనే వారు కూడా లేకపోలేదు. బీజేపీ ఓట్ల కోసమే డేరా చీఫ్ ను బయటకు వదలిందని ఆరోపణలు వస్తున్నాయి.

పంజాబ్ లో ఎన్నికల నేపథ్యంలో డేరా చీఫ్ ను బయటకు పంపడం బీజేపీసర్కార్ వ్యూహాత్మకంగా చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి ఆయన ఫాలోవర్లను రంజింపచేయడానికే ఆయనను ప్రభుత్వం బయటకు వదిలిందనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల వరకూ వస్తే రాజకీయ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదలవని ఈ ఉదంతాన్ని గమనించి అర్థం చేసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు.

ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు,అత్యాచారాలు చేసి దోషిగా తేలిన వ్యక్తిని కూడా ఎన్నికల అవసరార్థం బయటకు వదిలారంటే పాలిటిక్స్ ఇలా పతాకస్థాయిలో సాగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. కేవలం బయటకు వదలడమే కాదు.. డేరా చీఫ్ కు భారీ ఎత్తున భద్రతను కూడా హర్యానా ప్రభుత్వం కల్పించడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

డేరా చీఫ్ కు జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించడం అందరినీ షాక్ కు గురిచేసింది. డేరా చీఫ్ ను జైలు నుంచి బయటకు వదలడంపై ఒక వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.ఎన్నికల సమయంలో రాజకీయం కోసం ఆయనను బయటకు వదలారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే డేరా చీఫ్ హార్డ్ కోర్ క్రిమినల్ కాదని హర్యానా ప్రభుత్వం కోర్టులో పేర్కొనడం గమనార్హం.

డేరా చీఫ్ రెండు హత్యకేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం డేరాచీఫ్ ఆ హత్యలు చేయలేదని చెప్పడం విశేషం. ఆయన హత్యలను చేయించాడు తప్ప చేయలేదని హర్యానా ప్రభుత్వం హైకోర్టు తెలుపడం సంచలనమైంది.

దీన్ని బట్టి డేరాచీఫ్ ను వెనుకేసుకొస్తూ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కోసమే ఇలా చేసిందన్న విమర్శలున్నాయి. ఆయనకు ఖలిస్తాన్ తీవ్రవాదం నుంచి ముప్పు దృష్ట్యానే జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినట్టుగా కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.