Begin typing your search above and press return to search.
ప్లాస్మా దానం చేసి కాపాడిన దాత కాళ్లు కడిగిన డిప్యూటీ స్పీకర్
By: Tupaki Desk | 16 Aug 2020 10:10 AM GMTదేశంలో ఇప్పుడు అందరిదీ ఒకటే సమస్య.. బతుకు సమస్య. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడమే అందరి ముందున్న సవాల్. పేద, గొప్ప తేడా లేదు.. డబ్బు పరపతి సమస్యే లేదు. అంతా కరోనా మయం.. కరోనా కాటుకు బలికాకుండా అందరూ భిక్కుభిక్కుమంటున్నారు.
కరోనా ఇప్పుడు దేశంలో కోరలు చాస్తోంది. దేశ హోంమంత్రి నుంచి రాష్ట్రమంత్రుల వరకూ అందరికీ సోకుతోంది. కరోనాకు సరైన మందులు లేక.. వ్యాక్సిన్ రాక జనాలు ఆందోళన చెందుతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ప్లాస్మా దానం మాత్రమే బతికిస్తోంది.
కరోనాతో చావుబతుకుల మధ్య ఉన్న వారికి ప్లాస్మా థెరపీ చికిత్సనే బతికిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనాను జయించిన ప్లాస్మా దాతలు ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా తను చావు బతుకుల్లో ఉంటే ప్లాస్మా దానం చేసి బతికించిన దాత కాళ్లను కడిగి ఘనంగా సన్మానం చేశాడు అసోం డిప్యూటీ స్పీకర్ అనిముల్ హకే లష్కర్. ఇటీవలే అనిముల్ కు కరోనా సోకి చావు అంచుల వరకు వెళ్లగా ఓ వ్యక్తి ప్లాస్మా దానం చేసి కాపాడాడు. దీంతో కోలుకున్నాక అతడి ఇంటికి వెళ్లి కాళ్లు కడిగి కృతజ్ఞతలు తెలిపాడు అసోం స్పీకర్. ఇప్పుడీ చర్య దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ప్లాస్మా దాతల్లో స్ఫూర్తి నింపుతోంది.