Begin typing your search above and press return to search.
కరోనాతో కన్నుమూసిన డిప్యూటీ మేజిస్ట్రేట్ !
By: Tupaki Desk | 14 July 2020 11:00 AM GMTదేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో ప్రతి రోజు కూడా 25 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా రోజుకూ వందల సంఖ్యలోకరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కరోనా భారిన పడుతున్నారు. కరోనా భారిన ప్రముఖులు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ డిప్యూటీ మేజిస్ట్రేట్ కరోనా బారినపడి కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకోంది.
హూగ్లీ జిల్లాకు చెందిన దేబ్ దత్తా సెరాంపోర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతవారం ఆమెకు కరోనా సోకగా హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే , ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేర్పించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే.. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనా బారిన మరణించడం తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.కరోనా కారణంగా ఆమె మృతి చెందింది అన్న విషయం తెలుసుకున్న సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ కరోనా వైరస్ పై పోరులో ముందుండి పనిచేసి విశేష సేవలందించిన డిప్యూటీ మేజిస్ట్రేట్ మృతికి సీఎం మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించిన ఆమె మరణం తీరని లోటని ట్వీట్ చేశారు.