Begin typing your search above and press return to search.

డిఫ్యూటీ సీఎం సాబ్ కి స్వైన్ ఫ్లూ?

By:  Tupaki Desk   |   28 Jan 2017 6:46 AM GMT
డిఫ్యూటీ సీఎం సాబ్ కి స్వైన్ ఫ్లూ?
X
అసలే చలిరోజులు. దీనికి తోడు స్వైన్ ఫ్లూస్ వైరస్. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ లక్షణాలతో పలు కేసులు తెర మీదకు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో తెలంగాణ సర్కారు స్పందన అంతంతమాత్రంగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా చలికాలం వస్తుందంటే చాటు.. స్వైన్ ఫ్లూ విరుచుకుపడటం ఎక్కువగా ఉంటుంది. అయితే.. దీని కట్టడి విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలు అంతంతమాత్రంగా ఉన్నాయన్న మాటకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.. ఆయన సతీమణి విపరీతమైన గొంతునొప్పి.. దగ్గు.. జ్వరంతో బాధ పడుతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్న వారిద్దరూ ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించటంతో వారికి ఆ పరీక్షలు జరిపారు. వాటి శాంపిళ్లను పరీక్షలు జరపటానికి పంపారు.

వీలైనన్ని సౌకర్యాలు.. ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండే అవకాశం ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లోనే స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించటం చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితిలు ఎలా ఉన్నాయన్నది ఇట్టే అర్థమవుతుంది. పలు అంశాల మీద దృష్టి పెట్టే ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వైన్ ఫ్లూ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/