Begin typing your search above and press return to search.
విద్యాశాఖ అధికారా.. లైంగిక విద్యాధికారా?
By: Tupaki Desk | 7 Oct 2015 10:00 AM GMTకర్నూలు డీఈఓ రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియా శృంగార ప్రేమికులను సంబరాల్లో తేలియాడిస్తున్నాయి. ఏకంగా డీఈవో పైనే రాసలీలల ఆరోపణలు రావడంతో ఆర్జేడీ విచారణకు ఆదేశించారు. విషయం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వరకు వెళ్లడంతో ఆయనా దీనిపై సీరియస్ అయ్యారు. విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కర్నూలు డీఈవో డీవీ సుప్రకాష్ రాసలీలలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దీనిపై మంత్రి గంటా మండిపడుతున్నారు. డీఈఓ కొందరు మహిళలతో చేసిన శృంగార సంభాషణలు... దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సాప్ లలో హల్ చల్ చేస్తున్నాయి. సుప్రకాశ్ గత ఏడాది ప్రకాశం జిల్లా నుంచి కర్నూలుకు బదిలీపై వచ్చారు. ఆయనపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నా ఇంతవరకు బయటపడలేదు. మద్యం తాగి మహిళలతో సయ్యాటలు సాగిస్తారని ఆయనపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. అయితే... తాజాగా ఆయన సన్నిహితుల్లోనే ఒకరు ఈ దృశ్యాలను బయటపెట్టారని తెలుస్తోంది.
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన శాఖకు అధికారి అయిన ఆయనే ఇలాంటి నీచపు పనులు చేస్తుంటే ఎలా అని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. మహిళా ఉపాధ్యాయినులయితే ఇలాంటి డీఈఓ మాకు వద్దు అంటూ తిడుతున్నారు.